
Updated : 08 Nov 2021 07:59 IST
Table Tennis: మనిక జోడీకి టైటిల్
లాస్కో (స్లొవేనియా): డబ్ల్యూటీటీ కంటెండర్ టేబుల్ టెన్నిస్ టోర్నీలో మనిక బత్రా, అర్చనా కామత్ జోడీ మహిళల డబుల్స్ టైటిల్ను సొంతం చేసుకుంది. ప్రపంచ ర్యాంకింగ్స్లో 36వ స్థానంలో ఉన్న మనిక ద్వయం 11-3, 11-8, 12-10తో 23వ ర్యాంక్ జంట మెలానీ, అడ్రియానాను ఓడించింది. ఈ టోర్నీ సింగిల్స్ విభాగంలో మనిక సెమీఫైనల్లో ప్రవేశించింది.
Tags :