ఫిఫా ప్రపంచకప్‌కు ఇరాన్‌

ఈ ఏడాది నవంబర్‌లో ఖతార్‌ వేదికగా జరిగే ఫిఫా ప్రపంచకప్‌కు ఇరాన్‌ అర్హత సాధించింది. ఆసియా క్వాలిఫికేషన్స్‌ మూడో రౌండ్‌ గ్రూప్‌-ఏ మ్యాచ్‌లో 1-0తో ఇరాక్‌ను ఓడించిన ఇరాన్‌ 19 పాయింట్లతో (7 మ్యాచ్‌లు

Published : 29 Jan 2022 02:08 IST

టెహ్రాన్‌: ఈ ఏడాది నవంబర్‌లో ఖతార్‌ వేదికగా జరిగే ఫిఫా ప్రపంచకప్‌కు ఇరాన్‌ అర్హత సాధించింది. ఆసియా క్వాలిఫికేషన్స్‌ మూడో రౌండ్‌ గ్రూప్‌-ఏ మ్యాచ్‌లో 1-0తో ఇరాక్‌ను ఓడించిన ఇరాన్‌ 19 పాయింట్లతో (7 మ్యాచ్‌లు, 6 విజయాలు, 1 డ్రా) గ్రూపులో అగ్రస్థానంలో నిలిచి ప్రపంచకప్‌ బెర్తు దక్కించుకుంది. 48వ నిమిషంలో టారెమి చేసిన గోల్‌తో ఆ జట్టు విజయాన్ని అందుకుంది. ఆసియా నుంచి ఈసారి ప్రపంచకప్‌కు అర్హత సాధించిన తొలి జట్టు ఇరానే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని