Team India @ 1000: మెగా స్టేడియంలో మహా మ్యాచ్‌!

మొతెరా.. ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్‌ స్టేడియం. లక్ష సామర్థ్యంతో చాలా ఏళ్లుగా అతి పెద్ద స్టేడియంగా ఉంటున్న మెల్‌బోర్న్‌ మైదానాన్ని అధగమిస్తూ.. పునర్నిర్మాణం తర్వాత లక్షా 32 వేల సామర్థ్యంతో

Updated : 06 Feb 2022 11:42 IST

(Photo: BCCI Twitter)

మొతెరా.. ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్‌ స్టేడియం. లక్ష సామర్థ్యంతో చాలా ఏళ్లుగా అతి పెద్ద స్టేడియంగా ఉంటున్న మెల్‌బోర్న్‌ మైదానాన్ని అధగమిస్తూ.. పునర్నిర్మాణం తర్వాత లక్షా 32 వేల సామర్థ్యంతో గత ఏడాదే అందుబాటులోకి వచ్చింది నరేంద్ర మోడీ స్టేడియం. సామర్థ్యం పరంగానే కాక మరెన్నో రికార్డులకు నెలవైన ఈ మైదానంలో టీమ్‌ఇండియా తన వెయ్యో మ్యాచ్‌ ఆడబోతుండటం విశేషం. ప్రపంచ క్రికెట్లో ఈ మైలురాయిని అందుకోబోతున్న తొలి జట్టు భారతే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో వన్డే క్రికెట్లో భారత జట్టు మైలురాళ్లు..

54: వన్డేల్లో భారత్‌ అత్యల్ప స్కోరు. 2009 అక్టోబరు 29న శ్రీలంకపై 26.3 ఓవర్లే ఆడి ఆ స్కోరు చేసింది టీమ్‌ఇండియా.

49: వన్డేల్లో సచిన్‌ శతకాలు. అతనే నంబర్‌వన్‌.

257: బెర్ముడాపై 2007 మార్చి 19న మ్యాచ్‌లో భారత్‌ గెలుపు తేడా. పరుగుల పరంగా ఇదే అతి పెద్ద విజయం.

463: సచిన్‌ ఆడిన వన్డేలు. భారత్‌ తరఫునే కాదు, ప్రపంచ క్రికెట్లో అత్యధిక వన్డేలాడింది అతనే.

999: భారత్‌ ఇప్పటిదాకా ఆడిన వన్డేలు. అందులో 518 మ్యాచ్‌లు నెగ్గి, 431 వన్డేలు ఓడింది. తొమ్మిది మ్యాచ్‌లు టై అయ్యాయి. 41 మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు.

18426: వన్డేల్లో సచిన్‌ పరుగులు. ఈ ఫార్మాట్లో ప్రపంచ రికార్డు అతడిదే.

334: వన్డేల్లో కుంబ్లే వికెట్లు. భారత్‌ తరఫున అతనే అత్యధిక వికెట్ల వీరుడు.

6/4: బంగ్లాదేశ్‌పై 2014 జూన్‌ 17న స్టువర్ట్‌ బిన్నీ గణాంకాలు. వన్డేల్లో ఓ భారత బౌలర్‌ అత్యుత్తమ ప్రదర్శన ఇదే.

418/5: వన్డేల్లో భారత్‌ అత్యధిక స్కోరు. 2011 డిసెంబరు 8న ఇండోర్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో నమోదైంది.

200: కెప్టెన్‌గా ధోని ఆడిన వన్డేలు. భారత జట్టుకు   అత్యధిక వన్డేల్లో సారథ్యం వహించింది అతనే. ఇందులో 110 విజయాలు, 74 ఓటములు ఉన్నాయి. 5 మ్యాచ్‌లు టై కాగా  11 వన్డేల్లో ఫలితం రాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని