Ajinkya Rahane: అజింక్య రహానె అజేయ శతకం

ఫామ్‌ వెతుక్కుంటూ రంజీ బాట పట్టిన భారత జట్టు సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ అజింక్య రహానె (108 బ్యాటింగ్‌; 250 బంతుల్లో 14×4, 2×6) అజేయ సెంచరీతో సత్తాచాటాడు. సౌరాష్ట్రతో గురువారం

Updated : 18 Feb 2022 06:42 IST

అహ్మదాబాద్‌: ఫామ్‌ వెతుక్కుంటూ రంజీ బాట పట్టిన భారత జట్టు సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ అజింక్య రహానె (108 బ్యాటింగ్‌; 250 బంతుల్లో 14×4, 2×6) అజేయ సెంచరీతో సత్తాచాటాడు. సౌరాష్ట్రతో గురువారం మొదలైన రంజీ గ్రూప్‌-డి మ్యాచ్‌లో తొలి రోజు ఆటలో రహానె ఇన్నింగ్సే హైలైట్‌. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ముంబయి 44 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్‌, ఓపెనర్‌ పృథ్వీ షా (1)తో పాటు ఆకర్షిత్‌ (8), సచిన్‌ యాదవ్‌ (19) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. ఈ స్థితిలో మరో సెంచరీ వీరుడు సర్ఫ్‌రాజ్‌ ఖాన్‌ (121 బ్యాటింగ్‌; 219 బంతుల్లో 15×4, 2×6)తో కలిసి రహానె ఇన్నింగ్స్‌ను నడిపించాడు. తన శైలిలో షాట్లతో అలరించిన అతడు.. సర్ఫ్‌రాజ్‌ తోడుగా అభేధ్యమైన నాలుగో వికెట్‌కు 219 పరుగులు జత చేశాడు. ఆట ఆఖరికి ముంబయి తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లకు 263 పరుగులతో పటిష్ఠ స్థితిలో నిలిచింది. భారీ స్కోరుపై కన్నేసింది. ఇదే మ్యాచ్‌లో మరో టీమ్‌ఇండియా ఆటగాడు చతేశ్వర్‌ పుజారా సౌరాష్ట్ర తరఫున బరిలో దిగాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని