Ravindra Jadeja: జడేజా.. తగ్గేదేలే!

క్రికెటర్లలోకి బాగా దూసుకెళ్లిపోయాడు పుష్పరాజ్‌! అంతర్జాతీయ క్రికెటర్లు ఇప్పటికే చాలామంది ‘పుష్ప’ సినిమాలోని డ్యాన్సులు, డైలాగులతో అదరగొడుతున్నారు. శ్రీలంకతో తొలి టీ20 ద్వారా పునరాగమనం చేసిన ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా మ్యాచ్‌ మధ్యలో

Updated : 25 Feb 2022 08:18 IST

లఖ్‌నవూ: క్రికెటర్లలోకి బాగా దూసుకెళ్లిపోయాడు పుష్పరాజ్‌! అంతర్జాతీయ క్రికెటర్లు ఇప్పటికే చాలామంది ‘పుష్ప’ సినిమాలోని డ్యాన్సులు, డైలాగులతో అదరగొడుతున్నారు. శ్రీలంకతో తొలి టీ20 ద్వారా పునరాగమనం చేసిన ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా మ్యాచ్‌ మధ్యలో పుష్ప శైలిని అనుకరించడం విశేషం. తన బౌలింగ్‌లో చండిమాల్‌ను ఔట్‌ చేసిన అతడు పుష్పరాజ్‌ తరహాలో ‘తగ్గేదేలే’ అన్నట్లుగా సంజ్ఞ చేస్తూ సంబరాలు చేసుకున్నాడు. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతం అవుతోంది. సర్‌ పుష్పరాజ్‌ అని కొందరు.. రవీంద్ర పుష్ప జడేజా అని కొందరు అభిమానులు ఈ వీడియో కింద కామెంట్లు పెడుతున్నారు. ‘పుష్ప’ సినిమా విడుదల అయిన కొత్తలో ఆ సినిమాలో అల్లు అర్జున్‌ మాదిరే ‘తగ్గేదేలే’ అని డైలాగ్‌ చెబుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో జడేజా పెట్టిన వీడియో బాగా హిట్‌ అయింది. గతేడాది నవంబర్‌లోని న్యూజిలాండ్‌తో సిరీస్‌లో గాయపడిన జడ్డూ మళ్లీ మైదానంలో కనబడడం ఇదే తొలిసారి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని