Shane Warne: షేన్‌వార్న్‌కు తుది వీడ్కోలు

క్రికెట్‌ దిగ్గజం షేర్‌ వార్న్‌కు కుటుంబ సభ్యులు, స్నేహితులు తుది వీడ్కోలు పలికారు. వార్న్‌ స్వస్థలం మెల్‌బోర్న్‌లో ఆదివారం జరిగిన అంత్యక్రియల్లో వారంతా పాల్గొని నివాళులు అర్పించారు.

Updated : 21 Mar 2022 06:56 IST

మెల్‌బోర్న్‌: క్రికెట్‌ దిగ్గజం షేర్‌ వార్న్‌కు కుటుంబ సభ్యులు, స్నేహితులు తుది వీడ్కోలు పలికారు. వార్న్‌ స్వస్థలం మెల్‌బోర్న్‌లో ఆదివారం జరిగిన అంత్యక్రియల్లో వారంతా పాల్గొని నివాళులు అర్పించారు. వార్న్‌ ముగ్గురు పిల్లలు, తల్లిదండ్రులు, ఆస్ట్రేలియా మాజీ సారథులు మార్క్‌ టేలర్‌, అలన్‌ బోర్డర్‌.. ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌ సహా 80 మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ నెల 4న థాయ్‌లాండ్‌లో గుండె పోటుతో 52 ఏళ్ల వార్న్‌ మరణించాడు. అతని పార్థివ దేహం గతవారమే మెల్‌బోర్న్‌కు చేరుకుంది. ఈనెల 30న మెల్‌బోర్న్‌ క్రికెట్‌ మైదానంలో వార్న్‌ సంస్మరణ కార్యక్రమం జరుగనుంది. 1994లో ఇంగ్లాండ్‌పై హ్యాట్రిక్‌, 2006 బాక్సింగ్‌ డే టెస్టులో 700వ   వికెట్‌ సహా వార్న్‌ కెరీర్‌లో చిరస్మరణీయ ఘట్టాల దృశ్యాల్ని ఈ కార్యక్రమంలో ప్రదర్శిస్తారు. మైదానంలోని దక్షిణ స్టాండుకు వార్న్‌ పేరు పెట్టనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని