Yuzvendra Chahal: బెంగళూరు అడిగితే ఉండేవాణ్ని: చాహల్‌

జట్టుతో కొనసాగమని బెంగళూరు మేనేజ్‌మెంట్‌ బృందం తనను అడిగి ఉంటే కచ్చితంగా ఒప్పుకునేవాడినని యుజ్వేంద్ర చాహల్‌ చెప్పాడు. 2014 నుంచి 2021 వరకు ఆ జట్టు తరపున...

Updated : 29 Mar 2022 08:17 IST

ముంబయి: జట్టుతో కొనసాగమని బెంగళూరు మేనేజ్‌మెంట్‌ బృందం తనను అడిగి ఉంటే కచ్చితంగా ఒప్పుకునేవాడినని యుజ్వేంద్ర చాహల్‌ చెప్పాడు. 2014 నుంచి 2021 వరకు ఆ జట్టు తరపున ఆడిన అతను.. ఈ సీజన్‌ నుంచి రాజస్థాన్‌లో భాగమయ్యాడు. 2010లో రాజస్థాన్‌ జట్టులో ఒకడైన చాహల్‌కు అప్పుడు మైదానంలో దిగే అవకాశం రాలేదు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత తిరిగి ఎక్కడ మొదలెట్టాడో అక్కడికే చేరడం సంతోషంగా ఉందని చెప్పాడు. ‘‘నా మొదట కుటుంబంతో తిరిగి కలవడం సంతోషంగా ఉంది. రాజస్థాన్‌ తరపున ఆడేందుకు ఆత్రుతగా ఎదురు చూస్తున్నా. బెంగళూరుతో నాకు ఎంతో సాన్నిహిత్యం ఉంది. ఆ జట్టుతో భావోద్వేగ బంధం ఏర్పరుచుకున్నా. ఆ జట్టుకు కాకుండా మరో జట్టుకు ఆడతానని ఎప్పుడూ అనుకోలేదు. ఎక్కువ డబ్బు డిమాండ్‌ చేసి ఆ జట్టు నుంచి వెళ్లిపోయానని సామాజిక మాధ్యమాల్లో అంటున్నారు. కానీ అలాంటిదేమీ లేదు. బెంగళూరు డైరెక్టర్‌ హెసన్‌ నాకు ఫోన్‌ చేసి ముగ్గురు ఆటగాళ్ల (కోహ్లి, సిరాజ్‌, మ్యాక్స్‌వెల్‌)ను అట్టిపెట్టుకుంటున్నామని చెప్పారు. నన్ను అట్టిపెట్టుకునే విషయం కానీ లేదా డబ్బు గురించి కానీ ఏం అడగలేదు. వేలంలో కొనుగోలు చేస్తామన్నారు. ఒకవేళ వాళ్లు జట్టుతో కొనసాగిస్తామని చెబితే సంతోషంగా ఒప్పుకునేవాణ్ని. డబ్బు ప్రాధాన్యత కాదు. బెంగళూరు నాకెంతో ఇచ్చింది. ఇప్పుడు రాజస్థాన్‌కు ఆడబోతున్నంత మాత్రాన నా బౌలింగ్‌ మారదు. జెర్సీ మాత్రమే మారింది. వికెట్లు తీసేందుకు ప్రయత్నిస్తూనే ఉంటా. అన్ని విభాగాల్లోనూ పటిష్ఠంగా ఉన్న మా జట్టు టైటిల్‌ గెలిచే అవకాశం ఉంది’’ అని చాహల్‌ వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు