బోణీ కొట్టాలని..

మహిళల హాకీ ప్రపంచకప్‌లో భారత్‌ మరో పోరుకు సిద్ధమైంది. మంగళవారం పూల్‌-బి మ్యాచ్‌లో చైనాతో మన జట్టు తలపడనుంది. ఒలింపిక్‌ కాంస్య పతక విజేత ఇంగ్లాండ్‌తో తొలి మ్యాచ్‌లో వెనుకబడినా పుంజుకుని డ్రా చేసుకున్న భారత్‌.. అదే స్ఫూర్తితో చైనాపై సత్తా చాటాలని భావిస్తోంది.

Published : 05 Jul 2022 02:56 IST

నేడే చైనాతో భారత్‌ ఢీ

మహిళల హాకీ ప్రపంచకప్‌

రాత్రి 8 గంటల నుంచి

అమ్‌స్టల్‌వీన్‌ (నెదర్లాండ్స్‌): మహిళల హాకీ ప్రపంచకప్‌లో భారత్‌ మరో పోరుకు సిద్ధమైంది. మంగళవారం పూల్‌-బి మ్యాచ్‌లో చైనాతో మన జట్టు తలపడనుంది. ఒలింపిక్‌ కాంస్య పతక విజేత ఇంగ్లాండ్‌తో తొలి మ్యాచ్‌లో వెనుకబడినా పుంజుకుని డ్రా చేసుకున్న భారత్‌.. అదే స్ఫూర్తితో చైనాపై సత్తా చాటాలని భావిస్తోంది. ఇంగ్లాండ్‌తో పోరులో బాగానే ఆడినా ఆఖర్లో భారత్‌ పలు గోల్‌ అవకాశాలను వృథా చేసింది. మ్యాచ్‌లో ఏడు పెనాల్టీ కార్నర్లలో ఒక్క దాన్నే గోల్‌గా మలచగలిగింది. ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌ భారత్‌ డిఫెన్స్‌ లోపాలను కూడా బయటపెట్టింది. కెప్టెన్‌, గోల్‌కీపర్‌ సవిత పూనియా తన వంతుగా రాణిస్తున్నా.. డిఫెండర్లు ఆమెకు మద్దతుగా నిలవాల్సి ఉంది. చివరిగా హాకీ ప్రొ లీగ్‌లో చైనాతో రెండు మ్యాచ్‌లు ఆడిన మన జట్టు తొలి మ్యాచ్‌లో 7-1తో, రెండో మ్యాచ్‌లో 2-1తో గెలిచింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని