ప్రపంచకప్‌ కోసం విదేశీ ఆటగాళ్లు

ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో ఉత్తమ ప్రదర్శన దిశగా ఘనా సన్నాహకాలు మొదలెట్టింది. ఈ ఏడాది నవంబర్‌ 21న ఖతార్‌లో ఆరంభమయ్యే ఈ టోర్నీ కోసం కొత్తగా అయిదుగురు....

Published : 07 Jul 2022 03:44 IST

జట్టులోకి తీసుకున్న ఘనా

అక్రా (ఘనా): ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో ఉత్తమ ప్రదర్శన దిశగా ఘనా సన్నాహకాలు మొదలెట్టింది. ఈ ఏడాది నవంబర్‌ 21న ఖతార్‌లో ఆరంభమయ్యే ఈ టోర్నీ కోసం కొత్తగా అయిదుగురు విదేశీ ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంది. అండర్‌-21 విభాగంలో.. ఇంగ్లాండ్‌కు ఆడిన తరీఖ్‌ లాంప్టే, జర్మనీకి ప్రాతినిథ్యం వహించిన స్టీఫన్‌ ఆంబ్రోసియస్‌, రాన్స్‌ఫోర్డ్‌తో పాటు స్పెయిన్‌ తరపున ఓ స్నేహపూర్వక మ్యాచ్‌ ఆడిన విలియమ్స్‌, మరో జర్మనీ ఆటగాడు పాట్రిక్‌ ఫీఫర్‌ను ఘనా చేర్చుకుంది. ఈ ఆటగాళ్ల తమ దేశం తరపున ఆడేందుకు జాతీయత మార్చుకున్నారని ఘనా సాకర్‌ సమాఖ్య బుధవారం వెల్లడించింది. ఫిఫా నిబంధనల ప్రకారం తమ దేశం తరపున ఒక్క అంతర్జాతీయ మ్యాచ్‌ కూడా ఆడని ఆటగాళ్లు.. ఇలా ఇతర దేశాలకు ప్రాతినిథ్యం వహించొచ్చు. 2014 తర్వాత తొలిసారి, మొత్తంగా నాలుగో సారి ప్రపంచకప్‌కు అర్హత సాధించిన ఘనా.. పోర్చుగల్‌, దక్షిణ కొరియా, ఉరుగ్వేతో కలిసి గ్రూప్‌- హెచ్‌లో ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని