ధావన్‌ అకాడమీ ప్రారంభం

భారత సీనియర్‌ క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌ ‘డా వన్‌ స్పోర్ట్స్‌’ పేరిట ఆ అకాడమీని ఏర్పాటు చేశాడు. క్షేత్ర స్థాయిలో క్రీడాకారుల్లో నైపుణ్యాలను కనుగొనడం, వారికి శిక్షణ ఇవ్వడం వాటిపై ఈ అకాడమీ దృష్టి పెడుతుంది. ఎనిమిది క్రీడల్లో దిగువ స్థాయిలో ప్రతిభావంతులను

Published : 06 Aug 2022 03:30 IST

దిల్లీ: భారత సీనియర్‌ క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌ ‘డా వన్‌ స్పోర్ట్స్‌’ పేరిట ఆ అకాడమీని ఏర్పాటు చేశాడు. క్షేత్ర స్థాయిలో క్రీడాకారుల్లో నైపుణ్యాలను కనుగొనడం, వారికి శిక్షణ ఇవ్వడం వాటిపై ఈ అకాడమీ దృష్టి పెడుతుంది. ఎనిమిది క్రీడల్లో దిగువ స్థాయిలో ప్రతిభావంతులను గుర్తించి వారిని సానబడుతుంది. అంతేకాక సుమారు 500 మంది కోచ్‌లకు శిక్షణ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తుంది. ‘‘భారత్‌ వ్యాప్తంగా ఉత్తమ కోచ్‌లను ఎంపిక చేసి డా వన్‌ స్పోర్ట్స్‌ అకాడమీలోని క్రీడాకారులకు నాణ్యమైన శిక్షణ ఇప్పిస్తాం. క్రికెట్‌ నాకెంతో ఇచ్చింది. అందుకే నాకు వీలైనంత వరకు భారత్‌లో క్రీడలకు సాయం చేయాలని అనుకుంటున్నా’’ అని ధావన్‌ పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని