నాదల్‌ ఓటమితో..

గాయం కారణంగా ఆరు వారాలు టెన్నిస్‌కు దూరమైన స్పెయిన్‌ స్టార్‌ రఫెల్‌ నాదల్‌ ఓటమితో పునరాగమనం చేశాడు. వెస్ట్రన్‌ అండ్‌ సదరన్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ తొలి రౌండ్లో

Published : 19 Aug 2022 02:35 IST

మాసన్‌ (యుఎస్‌ఏ): గాయం కారణంగా ఆరు వారాలు టెన్నిస్‌కు దూరమైన స్పెయిన్‌ స్టార్‌ రఫెల్‌ నాదల్‌ ఓటమితో పునరాగమనం చేశాడు. వెస్ట్రన్‌ అండ్‌ సదరన్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ తొలి రౌండ్లో నాదల్‌ 6-7 (9-11), 6-4, 3-6తో క్రొయేషియా కుర్రాడు బోర్నా కొరిచ్‌ చేతిలో పరాజయం చవిచూశాడు. హోరాహోరీగా సాగిన తొలి సెట్లో టైబ్రేకర్‌లో ఓడిన రఫా.. రెండో సెట్‌ను గెలిచి మ్యాచ్‌లో నిలిచాడు. కానీ మూడో సెట్లో మళ్లీ తడబడి మ్యాచ్‌ను చేజార్చుకున్నాడు. ఈ సీజన్లో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌, ఫ్రెంచ్‌ ఓపెన్‌ గెలిచి గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల సంఖ్యను రికార్డు స్థాయిలో 22కు పెంచుకున్న రఫా.. ఆ తర్వాత గాయంతో బరిలో దిగలేదు. యుఎస్‌ ఓపెన్‌కు ముందు ఫామ్‌ నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్న ఈ మాజీ నంబర్‌వన్‌కు తాజా ఓటమి నిరాశ కలిగించేదే. మరోవైపు వెస్ట్రన్‌ అండ్‌ సదరన్‌ టోర్నీలో మహిళల సింగిల్స్‌లో ఎమ్మా రదుకాను జోరు కొనసాగుతోంది. రెండో రౌండ్లో ఆమె 6-0, 6-2తో అజరెంకాను ఓడించింది. తొలి రౌండ్లో అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్‌ను కూడా ఆమె ఇంటిముఖం పట్టించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని