వార్విక్‌షైర్‌కు సిరాజ్‌ ప్రాతినిధ్యం

భారత యువ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ ఇంగ్లాండ్‌ కౌంటీ జట్టు వార్విక్‌షైౖర్‌కు ప్రాతినిధ్యం వహించనున్నాడు. సెప్టెంబర్‌లో ఆ జట్టు ఆడే చివరి మూడు ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌ల్లో సిరాజ్‌ ఆడతాడు. జింబాబ్వేలో ప్రస్తుతం వన్డేలు ఆడుతున్న ఈ పేసర్‌.. భారత టీ20 ప్రణాళికల్లో

Published : 19 Aug 2022 02:35 IST

బర్మింగ్‌హామ్‌: భారత యువ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ ఇంగ్లాండ్‌ కౌంటీ జట్టు వార్విక్‌షైౖర్‌కు ప్రాతినిధ్యం వహించనున్నాడు. సెప్టెంబర్‌లో ఆ జట్టు ఆడే చివరి మూడు ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌ల్లో సిరాజ్‌ ఆడతాడు. జింబాబ్వేలో ప్రస్తుతం వన్డేలు ఆడుతున్న ఈ పేసర్‌.. భారత టీ20 ప్రణాళికల్లో లేకపోవడంతో ఎర్ర బంతి క్రికెట్‌పై దృష్టి పెట్టాడు. ‘‘ఈ సీజన్లో ఆడే చివరి మూడు కౌంటీ మ్యాచ్‌ల కోసం భారత పేసర్‌ సిరాజ్‌తో వార్విక్‌షైర్‌ ఒప్పందం చేసుకుంది. సెప్టెంబర్‌ 12న వార్విక్‌షైర్‌-సోమర్‌సెట్‌ మ్యాచ్‌ మొదలవడానికి ముందే సిరాజ్‌ ఎడ్జ్‌బాస్టన్‌ చేరుకుంటాడు’’ అని వార్విక్‌షైర్‌ క్లబ్‌ వెల్లడించింది. ‘‘వార్విక్‌షైర్‌తో ఆడేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా. ఇంగ్లాండ్‌లో క్రికెట్‌ ఆడటాన్ని ఎప్పుడూ ఆస్వాదిస్తా. కౌంటీ క్రికెట్‌ అనుభవాన్ని కూడా సంపాదించాలని అనుకుంటున్నా’’ అని సిరాజ్‌ అన్నాడు. సిరాజ్‌.. ఈ సీజన్లో వార్విక్‌షైర్‌కు ఆడుతున్న రెండో భారత ఆటగాడు. కృనాల్‌ పాండ్య ఇప్పటికే రాయల్‌ లండన్‌ వన్డే కప్‌లో ఈ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని