హాకీ ఇండియా అధ్యక్షుడిగా టిర్కీ

భారత హాకీ మాజీ కెప్టెన్‌ దిలీప్‌ టిర్కీ హాకీ ఇండియా (హెచ్‌ఐ) కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. షెడ్యూల్‌ ప్రకారం అక్టోబర్‌ 1న హాకీ ఇండియా ఎన్నికలు జరగాలి. అధ్యక్ష పదవితో పాటు మరే పదవికి పోటీ లేకపోవడంతో ఫలితాలను ముందే ప్రకటించారు.

Published : 24 Sep 2022 03:15 IST

దిల్లీ: భారత హాకీ మాజీ కెప్టెన్‌ దిలీప్‌ టిర్కీ హాకీ ఇండియా (హెచ్‌ఐ) కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. షెడ్యూల్‌ ప్రకారం అక్టోబర్‌ 1న హాకీ ఇండియా ఎన్నికలు జరగాలి. అధ్యక్ష పదవితో పాటు మరే పదవికి పోటీ లేకపోవడంతో ఫలితాలను ముందే ప్రకటించారు. అధ్యక్ష పదవికి టిర్కీతో పాటు యూపీ హాకీ సంఘం అధ్యక్షుడు రాకేశ్‌ కత్యాల్‌, జార్ఖండ్‌ హాకీ సంఘం అధ్యక్షుడు బోళా నాథ్‌సింగ్‌ పోటీపడ్డారు. శుక్రవారం రాకేశ్‌, భోళానాథ్‌ తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో టిర్కీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఓ ఆటగాడు హాకీ ఇండియా అధ్యక్ష పదవి చేపట్టనుండడం ఇదే తొలిసారి. హెచ్‌ఐ ఎన్నికల ఫలితాలను అంతర్జాతీయ హాకీ సమాఖ్య ధ్రువీకరించింది.
‘‘మాజీ ఆటగాళ్లు క్రీడా పరిపాలకులుగా ముందుకు రావాలి. ఎందుకంటే వాళ్లకు ఏ అంశాలపై దృష్టి పెట్టాలో బాగా తెలుస్తుంది. సౌరభ్‌ గంగూలీ మొదట బెంగాల్‌ క్రికెట్‌ సంఘం అధ్యక్షుడిగా మొదలై ఇప్పుడు బీసీసీఐ అధ్యక్షుడిగా ఎదిగాడు’’ అని దిలీప్‌ టిర్కీ అన్నాడు. సుబ్రమణ్య గుప్తా ఉపాధ్యక్షుడిగా, భోళానాథ్‌ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు చేపట్టనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని