ఇంగ్లాండ్‌దే టీ20 సిరీస్‌

డేవిడ్‌ మలన్‌ (78 నాటౌట్‌; 47 బంతుల్లో 8×4, 3×6) మెరుపులు మెరిపించడంతో పాకిస్థాన్‌తో ఏడు టీ20ల సిరీస్‌ను ఇంగ్లాండ్‌ సొంతం చేసుకుంది. నిర్ణయాత్మక ఏడో మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ 67 పరుగుల తేడాతో ఆతిథ్య పాక్‌ను చిత్తుచేసింది.

Published : 04 Oct 2022 02:10 IST

ఏడో మ్యాచ్‌లో పాక్‌ చిత్తు

లాహోర్‌: డేవిడ్‌ మలన్‌ (78 నాటౌట్‌; 47 బంతుల్లో 8×4, 3×6) మెరుపులు మెరిపించడంతో పాకిస్థాన్‌తో ఏడు టీ20ల సిరీస్‌ను ఇంగ్లాండ్‌ సొంతం చేసుకుంది. నిర్ణయాత్మక ఏడో మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ 67 పరుగుల తేడాతో ఆతిథ్య పాక్‌ను చిత్తుచేసింది. 17 ఏళ్ల తర్వాత పాక్‌లో పర్యటించిన ఇంగ్లాండ్‌ 4-3తో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. మొదట ఇంగ్లాండ్‌ 20 ఓవర్లలో 3 వికెట్లకు 209 పరుగుల భారీస్కోరు సాధించింది. మలన్‌తో పాటు బెన్‌ డకెట్‌ (30; 19 బంతుల్లో 3×4, 1×6), హ్యారీ బ్రూక్‌ (46 నాటౌట్‌; 29 బంతుల్లో 1×4, 4×6) రాణించారు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ మలన్‌.. బ్రూక్‌తో నాలుగో వికెట్‌కు అజేయంగా 108 పరుగులు జోడించాడు. అనంతరం పాక్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 142 పరుగులే చేయగలిగింది. కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ (4), మహ్మద్‌ రిజ్వాన్‌ (1) ఆరంభంలోనే ఔటవగా.. షాన్‌ మసూద్‌ (56; 43 బంతుల్లో 4×4, 1×6) ఒంటరి పోరాటం చేశాడు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో క్రిస్‌ వోక్స్‌ (3/26), రీస్‌ టాప్లీ (1/34), డేవిడ్‌ విల్లీ (2/22), ఆదిల్‌ రషీద్‌ (1/25), సామ్‌ కరన్‌ (1/27) రాణించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని