Team India: భారత జట్టులో తెలుగు తేజాలు

భారత అండర్‌-19 మహిళల క్రికెట్‌ జట్టులో ఇద్దరు తెలుగు అమ్మాయిలకు చోటు దక్కింది. న్యూజిలాండ్‌తో ముంబయి వేదికగా ఈ నెల 27 నుంచి జరిగే అయిదు టీ20ల సిరీస్‌ కోసం ప్రకటించిన భారత జట్టుకు గొంగడి త్రిష (తెలంగాణ), ఎం.షబ్నమ్‌ (ఏపీ) ఎంపికయ్యారు.

Updated : 21 Nov 2022 08:20 IST

అండర్‌-19 జట్టులో త్రిష, షబ్నమ్‌లకు చోటు

భారత అండర్‌-19 మహిళల క్రికెట్‌ జట్టులో ఇద్దరు తెలుగు అమ్మాయిలకు చోటు దక్కింది. న్యూజిలాండ్‌తో ముంబయి వేదికగా ఈ నెల 27 నుంచి జరిగే అయిదు టీ20ల సిరీస్‌ కోసం ప్రకటించిన భారత జట్టుకు గొంగడి త్రిష (తెలంగాణ), ఎం.షబ్నమ్‌ (ఏపీ) ఎంపికయ్యారు. హైదరాబాద్‌ అండర్‌-19 జట్టు తరఫున త్రిష ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో సత్తా చాటగా.. విశాఖపట్నంలో జరిగిన నాలుగు జట్ల సిరీస్‌లో భారత్‌-బి  తరఫున షబ్నమ్‌ రాణించింది. అండర్‌-19 ప్రపంచకప్‌కు సన్నాహకంగా కివీస్‌తో సిరీస్‌ను నిర్వహిస్తున్నారు. ఇందులో రాణిస్తే త్రిష, షబ్నమ్‌లకు ప్రపంచకప్‌ జట్టులోనూ చోటు దక్కొచ్చు.

దిల్లీ: తెలుగు అమ్మాయిలు గొంగడి త్రిష (తెలంగాణ), ఎం.షబ్నమ్‌ (ఆంధ్ర) భారత అండర్‌-19 జట్టులో చోటు దక్కించుకున్నారు. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో అయిదు టీ20ల సిరీస్‌లో వీళ్లు ఆడనున్నారు. హైదరాబాద్‌ అండర్‌-19 జట్టు తరఫున త్రిష ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో సత్తా చాటగా.. విశాఖపట్నంలో జరిగిన క్వాడ్రాంగ్యులర్‌ సిరీస్‌లో భారత్‌-బి తరఫున షబ్నమ్‌ రాణించింది. కివీస్‌తో టీ20 సిరీస్‌ ఈనెల 27న ఆరంభం కాబోతోంది. అన్ని మ్యాచ్‌లకు ముంబయి వేదికగా నిలువనుంది. జనవరి 14న దక్షిణాఫ్రికాలో మొదలు కానున్న అండర్‌-19 ప్రపంచకప్‌కు సన్నాహకంగా ఈ సిరీస్‌ను నిర్వహిస్తున్నారు. టీమ్‌ఇండియాకు శ్వేత సెహ్రావత్‌ కెప్టెన్‌గా వ్యవహరించనుంది.

ఐపీఎల్‌లో ఆంధ్ర క్రికెటర్లు: రాబోయే ఐపీఎల్‌ సీజన్‌లో ఆడే జట్లలో ఆంధ్ర క్రికెటర్లు రికీభుయ్‌, అవినాష్‌ (విశాఖపట్నం), కరుణ్‌ షిండే (కర్నూలు), ఎస్‌.కె.రషీద్‌ (గుంటూరు), గిరినాథరెడ్డి (అనంతపురం) ఎంపికయ్యారు. రికీభుయ్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు.. కరణ్‌, రషీద్‌ ముంబయి ఇండియన్స్‌కు.. అవినాష్‌, గిరినాథ్‌ రాజస్థాన్‌ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని