కొరియా పోరాడినా ఘనాదే గెలుపు

ఘనా-దక్షిణ కొరియా గ్రూప్‌-హెచ్‌ మ్యాచ్‌. రెండు గోల్స్‌ చేసి ధీమాగా ఉంది ఘనా! కానీ గొప్పగా పుంజుకున్న కొరియా ఆ జట్టును కంగారు పెట్టింది.

Published : 29 Nov 2022 02:26 IST

అల్‌ రయాన్‌: ఘనా-దక్షిణ కొరియా గ్రూప్‌-హెచ్‌ మ్యాచ్‌. రెండు గోల్స్‌ చేసి ధీమాగా ఉంది ఘనా! కానీ గొప్పగా పుంజుకున్న కొరియా ఆ జట్టును కంగారు పెట్టింది. అనూహ్యంగా రెండుసార్లు బంతిని నెట్‌లోకి పంపి స్కోరు సమం చేసింది. కానీ ఈ ఆసియా జట్టుకు నిరాశ కలిగిస్తూ వెంటనే మరో గోల్‌ కొట్టిన ఘనా 3-2తో విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో పోర్చుగల్‌ చేతిలో ఓడిన ఘనా.. ఈ విజయంతో గ్రూప్‌లో రెండో స్థానానికి చేరింది. ఒక డ్రా, మరో ఓటమితో అట్టడుగు స్థానంలో ఉన్న కొరియా.. నిష్క్రమణ ముంగిట నిలిచింది. సాలిస్‌ (24వ ని), కుడుస్‌ (34వ) గోల్స్‌తో ప్రథమార్ధంలో ఘనా పైచేయి సాధించింది. ద్వితీయార్థంలో అనూహ్యంగా ఎదురుదాడి చేసిన కొరియా.. ఘనా డిఫెన్స్‌కు పరీక్ష పెట్టింది. చో సంగ్‌ (58, 61వ ని) స్వల్ప వ్యవధిలో రెండు గోల్స్‌ చేయడంతో స్కోరు 2-2తో సమమై మ్యాచ్‌ ఆసక్తికరంగా మారింది. కానీ కుడుస్‌ 68వ నిమిషంలో మరో గోల్‌ కొట్టడంతో మ్యాచ్‌ ఘనా సొంతమైంది.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు