సమీర, నక్షత్రలకు స్వర్ణాలు

ఈనాడు సీఎస్‌ఆర్‌ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారులు తెలంగాణ రాష్ట్ర సబ్‌ జూనియర్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో సత్తాచాటుతున్నారు.

Published : 06 Dec 2022 02:47 IST

తెలంగాణ సబ్‌ జూనియర్‌ అథ్లెటిక్స్‌లో ‘లక్ష్య’ క్రీడాకారులకు 18 పతకాలు

ఈనాడు సీఎస్‌ఆర్‌ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారులు తెలంగాణ రాష్ట్ర సబ్‌ జూనియర్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో సత్తాచాటుతున్నారు. సోమవారం గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభమైన ఈ పోటీల్లో తొలిరోజు ‘లక్ష్య’ అథ్లెట్లు 18 పతకాలు కైవసం చేసుకున్నారు. అందులో 8 స్వర్ణ, 5 రజత, 5 కాంస్య పతకాలు ఉన్నాయి. అండర్‌-12 బాలికల 100 మీటర్ల పరుగులో కరీంనగర్‌ జిల్లాకు చెందిన నక్షత్ర (13.77 సెకన్లు), 600 మీ. పరుగులో సమీర బేగం (1 నిమిషం 52 సెకన్లు) అగ్రస్థానాల్లో నిలిచి పసిడి పతకాలు సొంతం చేసుకున్నారు. అండర్‌-8 బాలికల 50మీ. పరుగులో జాహ్నవి రావు (వరంగల్‌) స్వర్ణం, 300 మీ. పరుగులో జెశ్వెత రావు (వరంగల్‌) రజత పతకాలు సాధించారు. మంచిర్యాలకు చెందిన శ్రీకేతన్‌ అండర్‌-8 బాలుర 50 మీ., 300 మీ. పరుగులో స్వర్ణాలు గెలుచుకున్నాడు. మంచిర్యాల క్రీడాకారులు జ్యోతిర్మయి (అండర్‌-8 బాలికలు, 300 మీ.) స్వర్ణం, సింధ్య జాస్మిన్‌ (అండర్‌-8 బాలికలు, స్టాండింగ్‌ బ్రాడ్‌ జంప్‌) స్వర్ణం, సిద్ధార్థ (అండర్‌-8 బాలురు, బ్రాడ్‌ జంప్‌) రజతం, సిరిజ్ఞ చౌదరి (అండర్‌-12 బాలికలు, 100 మీ.) కాంస్య పతకాలు నెగ్గారు. సిద్దిపేటకు చెందిన అర్షిత (అండర్‌-12 బాలికలు, లాంగ్‌జంప్‌) కాంస్యం, వెంకటేశ్‌ (అండర్‌-12 బాలురు, 400 మీ.) రజత పతకాలు సాధించారు. జడ్చర్ల క్రీడాకారులు అనిల్‌ (అండర్‌-8 బాలురు, స్టాండింగ్‌ బ్రాడ్‌ జంప్‌) స్వర్ణం, రాజశేఖర్‌ (అండర్‌-12 బాలురు, 600 మీ.) రజతం, అరవింద్‌ (అండర్‌-8 బాలురు, 50 మీ.) కాంస్యం, శివకుమార్‌ (అండర్‌-12 బాలురు, లాంగ్‌జంప్‌) కాంస్య పతకాలు గెలుచుకున్నారు. పార్వతి (జడ్చర్ల) అండర్‌-8 బాలికల 50 మీ. పరుగులో కాంస్యం, స్టాండింగ్‌ బ్రాడ్‌ జంప్‌లో రజతం సాధించింది.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు