ఓటమితో మొదలెట్టిన అమ్మాయిలు

టీ20 ప్రపంచకప్‌ సన్నాహకాలను.. ఆస్ట్రేలియాతో పొట్టి సిరీస్‌నూ భారత అమ్మాయిల జట్టు ఓటమితో మొదలెట్టింది.

Published : 10 Dec 2022 02:28 IST

ఆసీస్‌ చేతిలో చిత్తు

ముంబయి: టీ20 ప్రపంచకప్‌ సన్నాహకాలను.. ఆస్ట్రేలియాతో పొట్టి సిరీస్‌నూ భారత అమ్మాయిల జట్టు ఓటమితో మొదలెట్టింది. అయిదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి టీ20లో టీమ్‌ఇండియా 9 వికెట్ల తేడాతో ఓడింది. బ్యాటింగ్‌లో రాణించిన జట్టు.. బౌలింగ్‌లో తేలిపోయింది. మొదట హర్మన్‌ సేన 20 ఓవర్లలో 5 వికెట్లకు 172 పరుగులు చేసింది. రిచా ఘోష్‌ (36; 20 బంతుల్లో 5×4, 2×6), దీప్తి శర్మ (36 నాటౌట్‌; 15 బంతుల్లో 8×4) ధనాధన్‌ బ్యాటింగ్‌తో జట్టుకు మెరుగైన స్కోరు అందించారు. దీప్తి మెరుపులతో జట్టు చివరి మూడు ఓవర్లలో 40 పరుగులు రాబట్టింది. ప్రత్యర్థి బౌలర్లలో ఎలీస్‌ పెర్రీ (2/10) రాణించింది. అనంతరం ఛేదనలో ఆసీస్‌ ఓ వికెట్‌ మాత్రమే కోల్పోయి 18.1 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. ‘‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’’ బెత్‌ మూనీ (89 నాటౌట్‌; 57 బంతుల్లో 16×4) మ్యాచ్‌ను లాగేసుకుంది. కెప్టెన్‌ అలీసా హీలీ (37)తో కలిసి తొలి వికెట్‌కు 73 పరుగులు జోడించిన ఆమె.. తహిల మెక్‌గ్రాత్‌ (40 నాటౌట్‌; 29 బంతుల్లో 4×4, 1×6)తో రెండో వికెట్‌కు అబేధ్యంగా 100 పరుగులు జతచేసి జట్టును గెలిపించింది. బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో వైఫల్యంతో భారత్‌ మూల్యం చెల్లించుకుంది. ఈ మ్యాచ్‌తో ఏపీ అమ్మాయి అంజలి అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. 4 ఓవర్లలో 27 పరుగులు ఇచ్చిన ఈ లెఫ్టార్మ్‌ పేసర్‌ సహచర బౌలర్ల కంటే పొదుపుగా బౌలింగ్‌ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని