Glenn Maxwell: భారతీయ యువతిని పెళ్లాడిన గ్లెన్‌ మాక్స్‌వెల్.. ఆర్సీబీ శుభాకాంక్షలు

ప్రముఖ ఆస్ట్రేలియా బిగ్‌ హిట్టర్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కీలక ఆటగాడు గ్లెన్‌ మాక్స్‌వెల్‌ ఐపీఎల్‌-15వ సీజన్‌కు ముందు ఓ ఇంటివాడయ్యాడు...

Updated : 19 Mar 2022 11:48 IST

(Photo: Vini Raman Instagram)

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ ఆస్ట్రేలియా బిగ్‌ హిట్టర్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కీలక ఆటగాడు గ్లెన్‌ మాక్స్‌వెల్‌ ఐపీఎల్‌-15వ సీజన్‌కు ముందు ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రేయసి, భారతీయ యువతి వినీ రామన్‌ను శుక్రవారం వివాహమాడాడు. అందుకు సంబంధించిన ఫొటోలను ఈ జంట తమ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ 2020 ఫిబ్రవరిలో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నట్లు సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. అయితే అప్పటి నుంచీ లాక్‌డౌన్‌, ఇతర కారణాల వల్ల వివాహాన్ని వాయిదా వేస్తూ వస్తోన్న ఈ జంట ఎట్టుకేలకు ఒక్కటైంది.

తమిళనాడుకు చెందిన వినీ ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఫార్మసిస్ట్‌గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే వారి మధ్య పరిచయం ఏర్పడి తర్వాత ప్రేమికులుగా మారారు. ఇప్పుడు పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఈ కొత్త జంటకు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పింది. కొద్దిసేపటి క్రితం ఆ విషయాన్ని తెలియజేస్తూ ఓ పోస్టు పెట్టింది.






Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని