Umran Malik : ఉమ్రాన్‌.. వేగం తగ్గించకు

జమ్ము ఫాస్ట్‌బౌలర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ ఐపీఎల్‌లో నిలకడగా 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బౌలింగ్‌ చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. అనేక మంది క్రికెట్‌ పండితులు అతడిపై ప్రశంసల జల్లు కురిపించారు. అయితే ఉమ్రాన్‌ పరుగులు కాస్త ఎక్కువే ఇచ్చాడు.

Updated : 17 Aug 2022 09:37 IST

దిల్లీ: జమ్ము ఫాస్ట్‌బౌలర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ ఐపీఎల్‌లో నిలకడగా 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బౌలింగ్‌ చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. అనేక మంది క్రికెట్‌ పండితులు అతడిపై ప్రశంసల జల్లు కురిపించారు. అయితే ఉమ్రాన్‌ పరుగులు కాస్త ఎక్కువే ఇచ్చాడు. అలా అని నియంత్రణ కోసం వేగాన్ని తగ్గించాల్సిన అవసరం లేదని ఆస్ట్రేలియా పేస్‌ దిగ్గజం మెక్‌గ్రాత్‌ అతడికి సూచించాడు. ‘‘అది అరుదైన వేగం. ఓ బౌలర్‌కు 150 కి.మీ పై వేగంతో బంతులేయడాన్ని నేర్పించలేం. అది సహజంగా రావాల్సిందే. బౌలర్‌ నియంత్రణ కోసం వేగాన్ని తగ్గించుకోవడం నాకు ఇష్టం ఉండదు. నియంత్రణ కోసం బౌలర్‌ నెట్స్‌లో బాగా కష్టపడాలి. కానీ పేస్‌ను మాత్రం బాగా తగ్గించుకోవద్దు. ఎందుకంటే 150 కి.మీ కన్నా ఎక్కువ వేగంతో బౌలింగ్‌ చేసే బౌలర్‌ అరుదు. ఉమ్రాన్‌ మాలిక్‌ బౌలింగ్‌ను నేనెక్కువగా చూడలేదు. కానీ అతడి వేగం నన్ను ఆకట్టుకుంది’’ అని మెక్‌గ్రాత్‌ అన్నాడు. ఎమ్మారెఫ్‌ పేస్‌ ఫౌండేషన్‌కు మెక్‌గ్రాత్‌ డైరెక్టర్‌ అన్న సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని