Gujarat Titans: వీరు గుజరాత్ టైటాన్స్ స్టార్లు.. మరి మీరు గుర్తు పట్టారా..?
కొత్త సాంకేతికతలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కీలక పాత్ర పోషిస్తోంది. ఈ టెక్నాలజీని వినియోగించుకుని గుజరాత్ టైటాన్స్ తన అభిమానులకు పజిల్ పెట్టింది.
ఇంటర్నెట్ డెస్క్: డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ (GT) మరోసారి దూసుకుపోతోంది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లోనూ (IPL 2023) పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే.. ప్లేఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకున్న తొలి టీమ్‌గా అవతరించింది. మే 21న చివరి మ్యాచ్‌లో బెంగళూరుతో తలపడేందుకు సమాయత్తమవుతోంది. ఈ క్రమంలో గుజరాత్ టైటాన్స్ వినూత్నంగా తమ ఆటగాళ్ల ఫొటోలను షేర్ చేసింది. ఇందులో వింతేముంది అంటారా..? అవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో రూపొందించిన ఫొటోలు కావడం విశేషం.
‘‘మా టైటాన్స్ ఆటగాళ్ల చిన్నప్పటి ఫొటోలను జనరేట్ చేయమని ఏఐకి రిక్వెస్ట్ చేశాం. వీరిలో ఎంతమంది టైటాన్స్ ఆటగాళ్లను మీరు గుర్తు పట్టారా..?’’ అని క్యాప్షన్ ఇస్తూ గుజరాత్ టైటాన్స్ ట్వీట్ చేసింది. దీంతో అభిమానులు తమ కామెంట్లతో నెట్టింట చెలరేగిపోయారు. శుభ్‌మన్ గిల్, నూర్ అహ్మద్, కేన్ విలియమ్సన్, డేవిడ్ మిల్లర్ అంటూ.. గుజరాత్ ఆటగాళ్ల పేర్లను కామెంట్ల రూపంలో తెలిపారు. అయితే, గుజరాత్ మాత్రం వీరు ఎవరెవరు? అనేది మాత్రం ఇంకా తెలపలేదు. మరో ట్వీట్‌లో షేర్ చేస్తుందని అభిమానులు భావిస్తున్నారు. ప్రస్తుతం గుజరాత్ 13 మ్యాచుల్లో 9 విజయాలతో 18 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో కొనసాగుతోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Amruta Fadnavis: ‘ఏక్నాథ్ శిందేను ట్రాప్ చేయాలన్నది మీరేగా’: అమృతా ఫడణవీస్‌కు బుకీ మెసేజ్..!
-
India News
Dhanbad: అక్రమ బొగ్గు గని కూలి ముగ్గురి మృతి.. శిథిలాల కింద చిక్కుకున్నవాళ్లెందరో?!
-
General News
TSPSC ప్రశ్నపత్రం లీకేజీ.. రూ.1.63 కోట్ల లావాదేవీలు: సిట్
-
Politics News
Revanth Reddy: మంత్రి కేటీఆర్ సవాల్‌ను స్వీకరిస్తున్నా: రేవంత్ రెడ్డి
-
General News
Andhra News: సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్ తెస్తామని సీఎం హామీ ఇచ్చారు: వెంకట్రామిరెడ్డి
-
Sports News
Harbhajan Singh: పెద్ద మ్యాచుల్లో టీమ్ ఇండియా ఒత్తిడికి గురవుతోంది: హర్భజన్