Hardik Pandya: అనుకోకుండా ఆల్‌రౌండర్‌నయ్యా : హార్ధిక్‌ పాండ్యా

ప్రస్తుత క్రికెటర్లలో అత్యుత్తమ ఆల్‌ రౌండర్‌గా ఎదిగిన భారత ఆటగాడు హార్ధిక్ పాండ్యా ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. తాను అనుకోకుండా ఆల్‌రౌండర్‌గా మారానని పేర్కొన్నాడు.

Published : 10 Sep 2021 02:11 IST

ఇంటర్నెట్‌ డెస్కు: ప్రస్తుత క్రికెటర్లలో అత్యుత్తమ ఆల్‌ రౌండర్‌గా ఎదిగిన భారత ఆటగాడు హార్ధిక్ పాండ్యా ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. తాను అనుకోకుండా ఆల్‌రౌండర్‌గా మారానని పేర్కొన్నాడు. ఇటీవల మాజీ క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌తో కలిసి హార్ధిక్‌ ఓ కార్యక్రమంలో పాల్గొన్నాడు. అందులో ‘నువ్వు ఆల్‌రౌండర్‌గా ఎలా మారావు?’అని కపిల్‌ దేవ్‌ ప్రశ్నించగా.. హార్ధిక్‌ ఈ విధంగా స్పందించాడు.

‘మొదట నేను బ్యాట్స్‌మెన్‌ని. మూడో స్థానంలో బ్యాటింగ్‌ చేసేవాడిని. అయితే, అండర్‌-19 మ్యాచులు ఆడుతున్నప్పుడు బౌలర్లకు భారం తగ్గించేందుకు అప్పుడప్పుడు బౌలింగ్‌ చేసేవాడిని. ఒకరోజు కిరణ్‌ మోరె అకాడమీలో ఆడుతున్పప్పుడు కోచ్‌ సనత్ కుమార్‌ సర్‌ దూరం నుంచి గమనించాడు. మరుసటి రోజు దగ్గరికి వచ్చి బౌలింగ్‌ చేయమన్నారు. అప్పటికి నాకు షూ కూడా లేవు. వేరేవాళ్లవి వేసుకుని బౌలింగ్‌ చేశాను. మొదటి సారే 5 వికెట్లు పడగొట్టడంతో.. తర్వాతి మ్యాచుల్లో కూడా బౌలింగ్‌ కొనసాగించమన్నారు. ఆ తర్వాత నెల రోజుల్లోనే రంజీ జట్టుకు ఎంపికయ్యాను. అలా అనుకోకుండా అదృష్టవశాత్తు ఆల్‌ రౌండర్‌గా మారాను’ అని హార్ధిక్‌ వివరించాడు.

ఇండియన్‌ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్‌)లో ముంబయి ఇండియన్స్‌ తరఫున ఆడుతున్న హార్ధిక్‌ పాండ్యా.. ఇప్పటికే జట్టుతో కలిసి దుబాయిలో ప్రాక్టీస్ మొదలు పెట్టిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని