Harbhajan Singh: పుజారా కంటే వాళ్లు గొప్ప ఆటగాళ్లా..? జట్టు ఎంపిక తీరుపై హర్భజన్‌

జులై 12 నుంచి టీమ్‌ఇండియా వెస్టిండీస్‌(India vs Westindies) పర్యటన ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టెస్టు, వన్డే జట్లను బీసీసీఐ(BCCI) ప్రకటించింది. అయితే.. టీమ్‌ ఎంపికపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.

Published : 24 Jun 2023 17:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : వెస్టిండీస్‌(India vs Westindies) పర్యటనకు టీమ్‌ ఇండియా(Team Inida) సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఆ దేశంతో టెస్టులకు, వన్డేలకు బీసీసీఐ సెలెక్షన్‌ కమిటీ జట్లను ప్రకటించింది. అయితే.. జట్ల ఎంపిక తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సునీల్‌ గావస్కర్‌, ఆకాశ్‌ చోప్రా తదితరులు బీసీసీఐపై విమర్శలు చేయగా.. తాజాగా టెస్టు జట్టు నుంచి తప్పించిన పుజారాకు మాజీ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌(Harbhajan Singh) మద్దతు తెలిపాడు.

తాజాగా ప్రకటించిన టెస్టు జట్టులో సీనియర్‌ ఆటగాడు ఛెతేశ్వర్ పుజారాపై వేటు వేసిన బీసీసీఐ సెలెక్షన్ కమిటీ.. యువ క్రికెటర్లు యశస్వి జైస్వాల్, రుతురాజ్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అయితే.. జట్టు నుంచి అతడిని తప్పించలేదని.. విశ్రాంతి ఇచ్చి ఉంటారని తాను భావిస్తున్నట్లు భజ్జీ పేర్కొన్నాడు.

‘జట్టులో పుజారా లేకపోవడం నాకు బాధ కలిగిస్తోంది. భారత్‌ తరఫున పెద్ద ప్లేయర్‌ అతడు. జట్టుకు వెన్నెముకలాంటివాడు. అతడికి రెస్ట్‌ ఇచ్చి ఉంటారు. తొలగించి ఉండరు. ఒకవేళ అతడిని జట్టు నుంచి తొలగిస్తే.. ఇతర బ్యాటర్ల యావరేజ్‌లు కూడా సరిగ్గా లేవు కదా. ఎంత పెద్ద ఆటగాళ్లైనా.. నిబంధనలు అందరికీ ఒకేలా ఉండాలి’ అని హర్భజన్‌ తన యూట్యూబ్‌ ఛానల్‌లో విమర్శించాడు.

‘భారత్‌.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లలో సిరీసులు గెలుచుకుంది. ఇందులో పుజారా భాగస్వామ్యం ఉంది. అయితే.. గత ఒకటిన్నర సంవత్సరాలుగా అతడు నిలకడగా ఆడటం లేదు. మరోవైపు ఇతర బ్యాటర్లనూ చూడండి. దాదాపు వారి పరిస్థితి కూడా అంతే కదా.  వంద టెస్టులు ఆడిన పుజారాకు గౌరవం ఇవ్వాలి. దీనిపై సెలెక్టర్లు అతడితో మాట్లాడి ఉంటారని.. తదుపరి రోడ్‌మ్యాప్‌పై అతడితో చర్చించి ఉంటారని నేను ఆశిస్తున్నాను’ అని భజ్జీ పేర్కొన్నాడు.

జులై 12 నుంచి భారత్‌ వెస్టిండీస్‌ పర్యటన ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లను ఆడనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని