
IND vs ENG: నాలుగో టెస్టుకు జేమ్స్ అండర్సన్ దూరం!
ఇంటర్నెట్ డెస్క్: సెప్టెంబరు 2న ఓవల్ వేదికగా ఇంగ్లాండ్, భారత్ జట్ల మధ్య జరగనున్న నాలుగో టెస్టుకు ఇంగ్లాండ్ ఫాస్ట్‌బౌలర్ జేమ్స్ అండర్సన్ దూరమయ్యే అవకాశం ఉంది. 39 ఏళ్ల అండర్సన్.. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు మూడు టెస్టుల్లో 116.3 ఓవర్లు బౌలింగ్ చేశాడు. దీంతో అతడిపై పనిఒత్తిడి తగ్గించాలనే ఉద్దేశంతో నాలుగో టెస్టుకు విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది.
‘మాకు మున్ముందు చాలా సిరీస్‌లున్నాయి. అందులో కఠినమైన టెస్టు మ్యాచ్‌లు మరికొన్ని రోజుల్లో వెంటవెంటనే జరగనున్నాయి. ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో వారిని దూరం చేసుకోవడం నాకిష్టం లేదు’అని అండర్సన్, ఓలీ రాబిన్సన్‌పై ఉన్న పనిఒత్తిడి గురించి క్రిస్ సిల్వర్‌వుడ్ వెల్లడించాడు.
‘ఈ ఇద్దరు ఆటగాళ్లు మైదానంలో జట్టుకు కీలకంగా ఉన్నారు. అయితే ఇప్పుడు నేను ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేను. నాలుగో టెస్టు ఆడొద్దని అండర్సన్‌ని ఒప్పించడం కష్టమైన పని ’ అని సిల్వర్‌వుడ్ అన్నాడు. మరోవైపు, ఈ సిరీస్ ప్రతి మ్యాచ్‌లో ఆడుతానని...సిరీస్ ఆరంభానికి ముందు అండర్సన్ ప్రకటించడం తెలిసిందే. మాంచెస్టర్ వేదికగా సెప్టెంబరు 10న ప్రారంభమయ్యే ఐదో టెస్టులో మాత్రం అండర్సన్ ఆడటం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే అది అండర్సన్ హోంగ్రౌండ్.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.