బ్లూ కాదు నేవీ బ్లూ: కోహ్లీసేన కొత్త జెర్సీ ఇదేనా?

టీమ్‌ఇండియా మళ్లీ సరికొత్త జెర్సీలు ధరించబోతోందా? ప్రస్తుతం ఉపయోగిస్తున్న నీలం రంగు నుంచి నేవీ బ్లూకు మారనుందా? అవి 1992 ప్రపంచకప్‌ రెట్రో జెర్సీల్లా దర్శనమిస్తాయా? అంటే ఔననే అంటున్నాయి అభిజ్ఞవర్గాలు!..

Published : 13 Nov 2020 00:59 IST

సోషల్‌ మీడియాలో వైరల్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌:‌ టీమ్‌ఇండియా మళ్లీ సరికొత్త జెర్సీలు ధరించబోతోందా? ప్రస్తుతం ఉపయోగిస్తున్న నీలం రంగు నుంచి నేవీ బ్లూకు మారనుందా? అవి 1992 ప్రపంచకప్‌ రెట్రో జెర్సీల్లా దర్శనమిస్తాయా? అంటే ఔననే అంటున్నాయి అభిజ్ఞవర్గాలు!

ఆస్ట్రేలియాతో త్వరలో ఆరంభమయ్యే టీ20, వన్డే సిరీసుల్లో కోహ్లీసేన సరికొత్త జెర్సీలు ధరించనుందని సమాచారం. ఇప్పుడున్న నీలం రంగులో కాకుండా అవి నేవీ బ్లూ రంగులో ఉంటాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన నమూనా చిత్రాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఇప్పటి వరకు జెర్సీల మార్పుపై బీసీసీఐ అధికారికంగా వివరణ ఇవ్వలేదు. కాకపోతే కొవిడ్‌-19 నేపథ్యంలో ఎక్కువ రక్షణ అందించే కిట్లు అందిస్తున్నామని మాత్రం చెప్పింది.

టీమ్‌ఇండియా సభ్యులు బీసీసీఐ అందించిన సరికొత్త కిట్లతో సందడి చేస్తున్నారు. అందరూ వాటిని ధరించి చిత్రాలు తీసుకున్నారు. వాటిని సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ఇవైతే 1992 ప్రపంచకప్‌నాటి నేవీబ్లూ రంగు జెర్సీల్లాగే కనిపించడం గమనార్హం. కాగా నవంబర్‌ 27 నుంచి మూడు వన్డేల సిరీస్‌, డిసెంబర్‌ 4 నుంచి మూడు టీ20ల సిరీస్‌ ఆరంభమవుతాయి.

ఇవీ చదవండి

టీ20 పోల్‌: ఏ జట్టుకు ఎన్ని మార్కులు?

కొడితే బంతే భయపడింది





Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని