ఎవరైనా బ్యాట్‌ను రిపేర్ చేసేవారు ఉన్నారా?
ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టీ20లో టీమ్‌ఇండియా ఉత్కంఠ పరిస్థితుల్లో 8 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. చివర్లో ఇంగ్లాండ్ పేస్ బౌలర్ జోఫ్రాఆర్చర్(18; 8 బంతుల్లో 2x4, 1x6)...
ఆర్చర్ మూడేళ్ల కిందటి ట్వీట్ వైరల్..
ఇంటర్నెట్‌డెస్క్: ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టీ20లో టీమ్‌ఇండియా ఉత్కంఠ పరిస్థితుల్లో 8 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. చివర్లో ఇంగ్లాండ్ పేస్ బౌలర్ జోఫ్రాఆర్చర్(18; 8 బంతుల్లో 2x4, 1x6) ధాటిగా ఆడి భారత శిబిరంలో కాస్త ఆందోళన కలిగించాడు. ఈ క్రమంలోనే ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో అతడి బ్యాట్ విరిగింది. అయితే, ఇప్పుడా విషయం ఆన్‌లైన్‌లో చర్చనీయాంశమైంది. ఎందుకంటే మూడేళ్ల క్రితం అతడు చేసిన ఓ ట్వీటే అందుకు కారణం. 2018 మార్చి 7న ఆర్చర్ ఓ ట్వీట్ చేస్తూ ‘ఇంగ్లాండ్‌లో ఎవరైనా బ్యాట్‌ను మంచిగా రిపేర్ చేసేవాళ్లు ఉన్నారా?’ అని పేర్కొన్నాడు. తాజాగా నాలుగో టీ20లో అతడి బ్యాట్ విరగడంతో ఆ ట్వీట్ వైరల్‌గా మారింది.
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ చివరి ఓవర్లో ఆ జట్టు విజయానికి 23 పరుగులు అవసరమయ్యాయి. అప్పుడు భారత విజయం తేలికే అనిపించింది. కానీ, శార్ధూల్ వేసిన ఆ ఓవర్‌లో జోర్డాన్(12) తొలి బంతికి సింగిల్ తీసిచ్చాడు. తర్వాత ఆర్చర్.. రెండు, మూడు బంతులను 4, 6గా మలిచాడు. దాంతో భారత శిబిరంలో కలవరం రేపాడు. ఆపై శార్ధూల్ వరుసగా రెండు వైడ్లు వేయడంతో ఉత్కంఠ మరింత పెరిగింది. సమీకరణం 3 బంతుల్లో 10 పరుగులకు మారింది. అలాంటి స్థితిలోనే ఆర్చర్ నాలుగో బంతిని ఎదుర్కోగా బ్యాట్ విరిగింది. అతడు సింగిల్ తీశాడు. అయిదో బంతికి జోర్డాన్ ఔటయ్యాడు. చివరి బంతికి ఆర్చర్ ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. దాంతో టీమ్‌ఇండియా విజయం సాధించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Ileana: ఆసుపత్రిలో చేరిన ఇలియానా.. త్వరగా కోలుకోవాలంటున్న ఫ్యాన్స్
-
India News
Droupadi Murmu: ధైర్యవంతమైన ప్రభుత్వం.. విప్లవాత్మక నిర్ణయాలు: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
-
Crime News
Andhra News: అచ్యుతాపురం సెజ్‌లో పేలిన రియాక్టర్: ఒకరి మృతి.. ముగ్గురికి తీవ్రగాయాలు
-
Crime News
Road Accident: స్కూల్ బస్సును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 30 మందికి గాయాలు
-
India News
Modi: బడ్జెట్ సమావేశాలకు ముందే.. ప్రపంచం నుంచి సానుకూల సందేశాలు..!
-
India News
Vistara: విమాన ప్రయాణికురాలి వీరంగం.. సిబ్బందిని కొట్టి, అర్ధ నగ్నంగా తిరిగి..!