Najam Sethi: మహమ్మద్ అమిర్ తిరిగి అంతర్జాతీయ క్రికెట్ ఆడొచ్చు: నజామ్ సేథీ
పాకిస్థాన్ మాజీ పేసర్ మహమ్మద్ అమిర్ తన రిటైర్మెంట్ను వెనక్కి తీసుకుంటే తిరిగి అంతర్జాతీయ క్రికెట్ ఆడొచ్చని పీసీబీ ఛైర్మన్ నజామ్ సేథీ తెలిపాడు.
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ పేసర్ మహమ్మద్ అమిర్ తిరిగి అంతర్జాతీయ క్రికెట్ ఆడొచ్చని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ నజామ్ సేథీ ప్రకటించాడు. 2010లో ఇంగ్లాండ్-పాకిస్థాన్ మధ్య జరిగిన సిరీస్‌లో స్పాట్ ఫిక్సింగ్‌కి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న అమిర్‌పై ఐదేళ్ల పాటు నిషేధం విధించిన విషయం తెలిసిందే. తర్వాత అతడు మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. 2020లో అతడు అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అమిర్ నిషేధ కాలం పూర్తైనందున తన రిటైర్మెంట్ని వెనక్కి తీసుకుంటే తిరిగి జాతీయ జట్టులో స్థానం పొందవచ్చని సేథీ సూచించాడు.
‘‘మహమ్మద్ అమిర్ తన రిటైర్మెంట్ని వెనక్కి తీసుకుంటే తిరిగి అంతర్జాతీయ క్రికెట్ ఆడొచ్చు. మ్యాచ్ ఫిక్సింగ్ పట్ల నేనేప్పుడూ కఠినంగానే వ్యవహరిస్తాను. దోషిగా తేలిన ఏ ఆటగాడు తప్పించుకోకూడదు. కానీ ఒక ఆటగాడు తన నిషేధ కాలం పూర్తి చేసుకున్నాక తిరిగి తన అంతర్జాతీయ క్రికెట్‌ను ప్రారంభించొచ్చు’’ అని సేథీ వెల్లడించాడు. అమిర్ ప్రస్తుతం బంగ్లాదేశ్ లీగ్(BPL)లో సిల్హెట్ స్ట్రెకర్స్ జట్టు తరఫున ఆడుతున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్‌తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్‌రౌండర్ గుల్బాదిన్ నయీబ్‌తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్‌రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్‌లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్‌లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.