
Dhoni : ల్యాండ్ రోవర్ కారు సొంతం చేసుకున్న ధోని.. ప్రత్యేకతలేంటో తెలుసా..!
(Photo : Big Boy Toyz India Instagram)
ఇంటర్నెట్ డెస్క్ : టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పేరు వినగానే ఎవరికైనా.. అతడు సాధించిన ఘన విజయాలే గుర్తొస్తాయి. కెప్టెన్‌గా భారత జట్టుని అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లాడు. భారత క్రికెట్ చరిత్రలో ధోనికి ప్రత్యేక స్థానం ఉంది. ధోనికి క్రికెట్ అంటే ఎంత ఇష్టమో.. వింటేజ్ కార్లు, బైకులన్నా అంతే ఇష్టం. వాటి కోసమే ఓ గ్యారేజ్‌ను నిర్వహిస్తున్నాడంటే.. అవి అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా అతడి గ్యారేజ్‌లోకి మరో వింటేజ్ ల్యాండ్ రోవర్ కారు చేరింది.
గత నెలలో గురుగ్రామ్‌లోని ‘బిగ్ బాయ్ టాయ్జ్ (బీబీటీ)’ అనే షో రూం నిర్వహించిన వేలంలో పాల్గొన్న ధోని.. 1970 మోడల్‌కి చెందిన ల్యాండ్ రోవర్ 3 కారుని సొంతం చేసుకున్నాడు. ఈ ల్యాండ్ రోవర్ కారుకి ఆటోమొబైల్ రంగంలో ప్రత్యేక స్థానం ఉంది. 1970 దశకం నుంచి 1980 మధ్య కాలం వరకు దీన్ని తయారు చేసేవారు. 2.25 లీటర్ల ఇంజిన్ సామర్థ్యం గల ఈ కారు మ్యానువల్ ట్రాన్స్‌మిషన్‌తో నడుస్తుంది. ఆన్‌లైన్ వేలం ద్వారా 50 శాతానికి పైగా స్టాక్‌ను విక్రయించినట్లు బీబీటీ షో రూం పేర్కొంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
PM Modi: తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారుకు ప్రజలు పట్టాలు వేస్తున్నారు: మోదీ
-
Politics News
Pawan Kalyan: వైకాపాకు, జనసేనకు ఉన్న తేడా అదే..: పవన్
-
Sports News
IND vs ENG: స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్
-
World News
Pakistan: పాక్‌లో ఘోర ప్రమాదం.. లోయలో పడిన బస్సు.. 19 మంది మృతి
-
World News
Ukraine Crisis: లుహాన్స్క్ ప్రావిన్సును చేజిక్కించుకున్న రష్యా!
-
Politics News
Amit Shah: ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణలో అధికారం మాదే: అమిత్ షా
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weekly Horoscope : రాశిఫలం ( జులై 03 - 09 )
- Naresh: ముదిరిన నరేశ్ కుటుంబ వివాదం.. పవిత్రను చెప్పుతో కొట్టబోయిన రమ్య
- Rent: భర్తను అద్దెకు ఇస్తున్న మహిళ.. రెంట్ ఎంతో తెలుసా?
- Hyderabad News: సాఫ్ట్వేర్ ఇంజినీర్ దారుణహత్య.. గొంతు నులిమి పెట్రోల్ పోసి తగులబెట్టారు!
- Jadeja-Anderson : 2014 ఘటన తర్వాత అండర్సన్‌కు ఇప్పుడు జ్ఞానోదయమైంది: జడేజా
- IND vs ENG : ఇటు బుమ్రా.. అటు వరుణుడు
- Samantha: కరణ్.. అన్‌హ్యాపీ మ్యారేజ్‌కి మీరే కారణం: సమంత
- ఇంతందం.. ఏమిటీ రహస్యం?
- Rashmika: విజయ్ దేవరకొండ.. ఇక అందరికీ నీ పేరే చెబుతా: రష్మిక
- Diabetes food chart: ఇవి తినండి...షుగర్ తగ్గించుకోండి