Nathan Lyon: ఆ ముగ్గురే అత్యుత్తమం.. అందులో ఇద్దరు టీమ్‌ఇండియా బ్యాటర్లే: లైయన్

తన కెరీర్‌లో ఇప్పటి వరకు ముగ్గురు బ్యాటర్లను ఎదుర్కొవడంలో ఇబ్బంది పడినట్లు ఆసీస్ స్టార్‌ స్పిన్నర్ నాథన్ లైయన్ వెల్లడించాడు.

Updated : 04 Jan 2024 11:50 IST

ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియా టాప్‌ బౌలర్‌ నాథన్ లైయన్‌ ఎదుర్కొన్న అత్యుత్తమ బ్యాటర్లు ముగ్గురు ఉన్నారంట. వారిలో ఇద్దరు టీమ్ఇండియా క్రికెటర్లు కావడం విశేషం. తాజాగా పాకిస్థాన్‌తో టెస్టు సిరీస్‌లో 500 వికెట్ల మైలురాయిని లైయన్ దాటేశాడు. సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు సందర్భంగా అతడు మాట్లాడిన వీడియో వైరల్‌గా మారింది. 

వ్యాఖ్యాత: ‘‘నీకు ఎదురైన కఠిన బ్యాటర్లు ఎవరు?’’

లైయన్‌: ఇది చాలా క్లిష్టమైన ప్రశ్న. కానీ, నేను ఇప్పటి వరకు ఆడిన వారిలో ముగ్గురు మాత్రం చాలా కఠిన బ్యాటర్లు. వారితో చాలా అద్భుతమైన మ్యాచ్‌లు ఆడా. విరాట్ కోహ్లీ, సచిన్ తెందూల్కర్, ఏబీ డివిలియర్స్. వీరిని ఔట్ చేయడానికి చాలా శ్రమించా. వీరు ఓ పట్టాన వికెట్‌ ఇచ్చే ఆటగాళ్లు కాదు. వారి డిఫెన్స్‌కు పరీక్ష పెడితేనే వికెట్‌ దక్కుతుంది. ఆ ముగ్గురిని ఔట్‌ చేయడం వెనుకున్న సీక్రెట్ ఇదే.

షహీన్‌ను పెక్కన పెట్టడంపై ఆకాశ్ చోప్రా..

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో పాకిస్థాన్‌ జట్టు పేసర్‌ షహీన్‌కు విశ్రాంతినిచ్చింది. అయితే, పాక్‌ తీసుకున్న నిర్ణయంపై భారత మాజీ ఆటగాడు ఆకాశ్‌ చోప్రా అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇది టెస్టు క్రికెట్‌ను నాశనం చేయడానికేనని వ్యాఖ్యానించాడు. అంతకుముందు దక్షిణాఫ్రికా కూడా న్యూజిలాండ్‌ పర్యటనకు కొత్తవారిని ఎంపిక చేయడంపైనా చోప్రా స్పందించాడు. ‘‘ఇటీవల కొన్ని జట్లు తీసుకుంటున్న నిర్ణయాలు టెస్టు క్రికెట్‌ను ఐసీయూకి చేర్చేలా ఉన్నాయి. కేవలం మూడు లేదా నాలుగు జట్లు మాత్రమే టెస్టు క్రికెట్‌ పట్ల ఆసక్తి చూపిస్తున్నాయి. తాజాగా కివీస్‌ పర్యటనకు దక్షిణాఫ్రికా ప్రకటించిన జట్టు, ఆసీస్‌తో మూడో టెస్టులో స్టార్‌ పేసర్ షహీన్‌ను పాక్‌ ఆడించకపోవడం వంటి చర్యలు టెస్టు క్రికెట్ పతనానికి దారి తీసేలా ఉన్నాయి’’ అని చోప్రా వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని