Asia Cup 2023: సూపర్‌-4లో బంగ్లాను చిత్తు చేసిన పాక్‌

సూపర్‌-4లో బంగ్లాదేశ్‌ను పాక్‌ జట్టు ఓడించింది. తొలుత తక్కువ స్కోర్‌కే బంగ్లాను కట్టడిచేసిన పాక్‌ అనంతరం బ్యాటింగ్‌లో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.  

Published : 06 Sep 2023 23:08 IST

లాహోర్‌: ఆసియా కప్‌లో భాగంగా సూపర్‌-4 తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై ఆతిథ్య పాకిస్థాన్‌ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ 38.4 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌట్‌ అయింది. ముష్పికర్‌ రహీమ్‌(64), షకిబ్‌(53) మినహా మిగతావారు విఫలం కావడంతో తక్కువ స్కోర్‌కే పరిమితమైంది. పాక్‌ బౌలర్లలో హరిస్‌ రవూప్‌ నాలుగు వికెట్లు తీసి బంగ్లాను దెబ్బతీశాడు. మరో బౌలర్‌ నసీమ్‌ షా మూడు వికెట్లు తీశాడు. అనంతరం 194 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ చేసిన పాక్‌ 39.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఇమామ్‌ ఉల్‌ హక్‌(78), మహమ్మద్‌ రిజ్వాన్‌(63) అర్ధశతకాలతో చెలరేగారు. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని