Praggnanandhaa: ఆ క్రికెటర్‌ అంటే చాలా ఇష్టం: ప్రజ్ఞానంద

ప్రధాని మోదీని మాట్లాడటాన్ని తాను చాలా ఎంజాయ్‌ చేశానని చెప్పాడు చెస్‌ గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద (Praggnanandhaa). చెస్‌తో పాటు తాను క్రికెట్‌ను కూడా ఫాలో అవుతానని అన్నాడు.

Published : 04 Sep 2023 14:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చెస్‌ ప్రపంచకప్‌ (Chess world cup)లో రన్నరప్‌గా నిలిచిన భారత యువ సంచలనం, గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద (Praggnanandhaa) తాజాగా మీడియాతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఇటీవల ప్రధాని మోదీ (PM Modi)ని కలిసినప్పటి సంగతులను చెప్పాడు. ప్రధానితో తాను కేవలం చెస్‌ గురించి మాత్రమే మాట్లాడలేదని, అనేక విషయాల గురించి తాము చర్చించుకున్నామని అన్నాడు. అంతేగాక, తనకు ఇష్టమైన క్రికెటర్‌ (favourite cricket) ఎవరో కూడా చెప్పాడు.

ఫిడె ప్రపంచకప్‌ (Chess World cup)లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న ప్రజ్ఞానంద గతవారం తన తల్లిదండ్రులు రమేశ్‌ బాబు, నాగలక్ష్మిలతో కలిసి దిల్లీలో ప్రధానిని కలిశాడు. ఆ సమయంలో ప్రధాని తనను అనేక విషయాల గురించి అడిగారని ప్రజ్ఞానంద (Praggnanandhaa) తాజాగా మీడియాకు చెప్పాడు. ‘‘ప్రధాని మోదీని కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు కాస్త కంగారుగా అనిపించినా.. ప్రధాని నాతో చాలా సాధారణంగా ఉన్నారు. నా శిక్షణ, మా నాన్న ఉద్యోగం తదితర విషయాల గురించి అడిగారు. కొన్ని సలహాలు కూడా ఇచ్చారు. నాకు అండగా నిలిచినందుకు ప్రధానికి కృతజ్ఞతలు’’ అని ప్రజ్ఞానంద తెలిపాడు.

తండ్రైన బుమ్రా.. ఇన్‌స్టాలో ఫొటో షేర్‌ చేసిన క్రికెటర్‌

ఇక చెస్‌తో పాటు తాను క్రికెట్‌ను కూడా ఫాలో అవుతానని ప్రజ్ఞానంద చెప్పాడు. తనకు టీమ్‌ఇండియా ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ (Ravichandran Ashwin) అంటే చాలా ఇష్టమని తెలిపాడు. ఇక, ఫిట్‌నెస్‌ గోల్స్‌, ఆహార అలవాట్లను కూడా పంచుకున్నాడు. ‘‘ఆటపై ఏకాగ్రతను పెంచుకోవడం కోసం యోగా, ధ్యానం చేస్తాను. గేమ్‌ ఆడటానికి వెళ్లేముందు భారతీయ ఆహారం తీసుకునేందుకే ఇష్టపడతా. నాకు మన వంటలే ఇష్టం. ముఖ్యంగా అమ్మ చేసిన ఇంటి భోజనాన్ని ఎక్కువగా ఇష్టపడతా’’ అని ప్రజ్ఞానంద చెప్పాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని