IPL 2021: గర్వంగా ఉంది బ్రదర్‌..: విరాట్ కోహ్లి సోదరి భావోద్వేగ పోస్ట్‌

కోల్‌కతా నైట్ రైడర్స్‌తో సోమవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ ఓటమితో బెంగళూరు జట్టు లీగ్ నుంచి నిష్క్రమించింది. అయితే,..

Published : 13 Oct 2021 02:27 IST

ఇంటర్నెట్ డెస్క్‌: కోల్‌కతా నైట్ రైడర్స్‌తో సోమవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ ఓటమితో బెంగళూరు జట్టు లీగ్ నుంచి నిష్క్రమించింది. అయితే, ఆర్సీబీ కెప్టెన్‌గా కోహ్లికిదే చివరి మ్యాచ్‌ కావడం గమనార్హం. దీనిపై విరాట్‌ కోహ్లి సోదరి భావనా కోహ్లి థింగ్రా స్పందించారు. కోహ్లి నాయకత్వం గురించి తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో ఓ భావోద్వేగ పోస్ట్ చేశారు. ‘కెప్టెన్‌గా జట్టు కోసం నువ్వు చేయగలిగినంతా చేశావు. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా గొప్పగా రాణించేందుకు ప్రయత్నించావు. బెంగళూరు కెప్టెన్‌గా నువ్వు ఎప్పటికీ గుర్తుండిపోతావు. బెంగళూరు కెప్టెన్ అనే పదానికి నీ పేరు పర్యాయపదంగా మారింది. గొప్ప నాయకుడిగా గౌరవం, ప్రశంసలు పోందడానికి నువ్వు అర్హుడివి. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది బ్రదర్‌..’ అంటూ కోహ్లి సోదరి పోస్ట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని