Amitabh Bachchan: భజ్జీ బౌలింగ్‌లో సిక్స్‌ కొట్టిన బిగ్ బీ.!

పాపులర్‌ టీవీ గేమ్‌ షో ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’లో అమితాబ్ బచ్చన్‌ సరదాగా బ్యాటు పట్టి అలరించాడు. భారత మాజీ క్రికెటర్లు హర్భజన్‌ సింగ్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి..

Published : 18 Dec 2021 01:08 IST

ఇంటర్నెట్ డెస్క్‌: పాపులర్‌ టీవీ గేమ్‌ షో ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’లో అమితాబ్ బచ్చన్‌ సరదాగా బ్యాటు పట్టి అలరించారు. భారత మాజీ క్రికెటర్లు హర్భజన్‌ సింగ్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌ ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. హర్భజన్‌ సింగ్ బౌలింగ్‌లో బిగ్ బీ.. ఓ సిక్స్, ఓ ఫోర్‌ బాదారు. ఇర్ఫాన్‌ పఠాన్ కామెంటరీ చెబుతూ కనిపించాడు. ‘మేం చాలా మంది దిగ్గజ క్రికెటర్లతో కలిసి ఆడాం. కానీ, అమితాబ్ లాంటి దిగ్గజ ఆటగాడితో ఇప్పటి వరకు ఆడలేదు’ అని ఇర్ఫాన్‌ పఠాన్‌ అన్నాడు. ఆ వీడియోను పఠాన్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో పంచుకున్నాడు. మీరూ ఆ వీడియోను చూసేయండి.!

Read latest Sports News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని