IPL 2024 - Rinku Singh: టీనేజ్‌ క్రికెటర్‌కు క్షమాపణలు చెప్పిన రింకు సింగ్.. కారణమిదే?

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ స్టార్ ఆటగాడు రింకు సింగ్‌ (Rinku Singh) ఓ టీనేజ్‌ క్రికెటర్‌కు క్షమాపణలు చెప్పాడు. కారణం ఏంటంటే..

Updated : 12 Mar 2024 17:22 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్-2024 సీజన్‌ ఆరంభానికి సమయం దగ్గర పడింది. దీంతో ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యారు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (Kolkata Knight Riders) స్టార్ ఆటగాడు రింకు సింగ్‌ (Rinku Singh) కూడా నెట్స్‌లో చెమటోడ్చుతున్నాడు. భారీ షాట్స్‌ ఎలా కొట్టాలో ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. మైదానంలో రింకు బ్యాటింగ్ చేస్తుండగా అతడు కొట్టిన ఓ భారీ షాట్‌ టీనేజ్‌ క్రికెటర్‌ నుదిటికి తగిలింది. ఈ విషయం తెలుసుకున్న రింకు సింగ్ వెంటనే ఆ బాలుడి దగ్గరికి వెళ్లి గాయాన్ని పరిశీలించి క్షమాపణలు చెప్పాడు.

కోల్‌కతా బ్యాటింగ్ అభిషేక్ నాయర్‌ ఆ టీనేజ్ క్రికెటర్‌కు కేకేఆర్‌ టోపీని బహుకరించాడు. రింకు ఆ టోపీని తీసుకుని సంతకం చేసి ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను కేకేఆర్‌ ఫ్రాంఛైజీ సామాజిక మధ్యమం ఎక్స్‌ (X)లో పంచుకుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ‘రింకుది గొప్ప మనస్సు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఐపీఎల్‌-2024లో మార్చి 23న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తొలి మ్యాచ్‌ ఆడనుంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని