SA vs IND: భారత్‌తో తొలి టెస్టు.. పట్టుబిగించిన సఫారీలు.. రెండో రోజు ఆట పూర్తి

భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో సౌతాఫ్రికా పట్టుబిగించింది. 

Updated : 27 Dec 2023 21:29 IST

సెంచూరియన్‌: సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత బౌలర్లు తేలిపోయారు. దక్షిణాఫ్రికా బ్యాటర్లు.. టీమ్‌ఇండియా బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొన్నారు. దీంతో రెండో రోజు ఆట ముగిసేసరికి సౌతాఫ్రికా.. 256/5 స్కోరుతో మెరుగైనస్థితిలో నిలిచింది. సరైన వెలుతురు లేమి కారణంగా ఆటను 66 ఓవర్ల వద్ద నిలిపివేశారు. ప్రస్తుతం సఫారీలు 11 పరుగుల ఆధిక్యంలో ఉన్నారు. డీన్ ఎల్గర్‌ (140*; 211 బంతుల్లో 23 ఫోర్లు) శతకంతో అదరగొట్టగా.. డేవిడ్ బెడింగ్‌హమ్ (56; 87 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకం బాదాడు. ఎల్గర్‌తోపాటు మార్కో జాన్సన్‌ (3*) క్రీజులో ఉన్నాడు.

టోనీ డి జోర్జి (28), మార్‌క్రమ్ (5), కీగన్ పీటర్సన్ (2), వెరినే (4) పరుగులు చేశారు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ప్రసిద్ధ్‌ కృష్ణకు ఒక వికెట్ దక్కింది. అంతకుముందు 208/8 ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్ మరో 37 పరుగులు జోడించి 245 పరుగులకు ఆలౌటైంది. 70 పరుగులతో క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్‌ (101) శతకం బాది చివరి వికెట్‌గా వెనుదిరిగాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని