Sunrisers Hyderabad: ఐపీఎల్‌ 2024.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కొత్త జెర్సీ చూశారా!

ఐపీఎల్‌-2024లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (Sunrisers Hyderabad) కొత్త జెర్సీతో బరిలోకి దిగనుంది. న్యూ జెర్సీ ఫొటోలను ఫ్రాంఛైజీ  సోషల్‌ మీడియాలో పంచుకుంది.

Published : 07 Mar 2024 21:38 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్‌-2024 (IPL 2024)కు సమయం దగ్గరపడుతోంది. మార్చి 22 నుంచే ఈ మెగా టోర్నీ అభిమానులను అలరించనుంది. దీంతో నిర్వాహకులు ఏర్పాట్లను వేగవంతం చేశారు. ఫ్రాంఛైజీలు ఆటగాళ్లను శిబిరాలకు రప్పిస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది ప్లేయర్లు జట్లతో కలిసి సాధన చేస్తున్నారు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (Sunrisers Hyderabad) కూడా ఐపీఎల్‌-2024 సిద్ధమవుతోంది. ఎస్‌ఆర్‌హెచ్‌ ఆటగాళ్లు ఉప్పల్ స్టేడియంలో ప్రాక్టీస్‌ సెషన్స్‌లో పాల్గొంటున్నారు. ఈ సీజన్‌లో ‘ఆరెంజ్‌ ఆర్మీ’ ధరించే కొత్త జెర్సీని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. గత సీజన్లతో పోలిస్తే ఈ సారి జెర్సీ కాస్త భిన్నంగా ఉంది. నారింజ రంగు జెర్సీపై నలుపు రంగు డిజైన్‌ను ముద్రించారు. సీనియర్‌ పేసర్ భువనేశ్వర్‌ కొత్త జెర్సీ ధరించి ఫొటోలకు పోజులిచ్చాడు.

మార్చి 23న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తొలి మ్యాచ్‌ ఆడనుంది. గత సీజన్‌లో జట్టును నడిపించిన ఐదెన్ మార్‌క్రమ్‌ను బాధ్యతల నుంచి తప్పించి కమిన్స్‌కు అప్పగించింది. గత సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ 14 మ్యాచ్‌లు ఆడి నాలుంగింటిలోనే విజయం సాధించి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. ఈ సారి కమిన్స్‌ సారథ్యంలో ఆరెంజ్‌ ఆర్మీ మెరుగైన ప్రదర్శన చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

సన్‌రైజర్స్‌ జట్టు ఇదే:

ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), అబ్దుల్ సమద్, ఐదెన్ మార్‌క్రమ్, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్‌, మయాంక్‌ అగర్వాల్, హెన్రిచ్ క్లాసెన్, అన్మోల్‌ప్రీత్‌ సింగ్, ఉపేంద్ర యాదవ్, నితీశ్ కుమార్‌ రెడ్డి, అభిషేక్ శర్మ, మార్కో జాన్‌సెన్, వాషింగ్టన్ సుందర్, సన్వీర్‌ సింగ్, భువనేశ్వర్ కుమార్, ఫజల్‌హక్‌ ఫారూఖి, టి. నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, మయాంక్‌ మార్కండే, ట్రావిస్‌ హెడ్, వనిందు హసరంగ, జయ్‌దేవ్ ఉనద్కత్, ఆకాశ్ సింగ్, సుబ్రమన్యన్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని