ఎవరడిగినా భారతీయులమని గర్వంగా చెబుతాం.. 

దేశ ప్రజలకు టీమ్‌ఇండియా క్రికెటర్లు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. భారత్ నేడు 72వ గణతంత్ర దినోత్సవం జరుపుకొంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సచిన్...

Updated : 26 Jan 2021 13:42 IST

గణతంత్ర దినోత్సవం సందర్భంగా క్రికెటర్ల శుభాకాంక్షలు..

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశ ప్రజలకు టీమ్‌ఇండియా క్రికెటర్లు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత్ నేడు 72వ గణతంత్ర దినోత్సవం జరుపుకొంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సచిన్‌, సెహ్వాగ్‌, హర్భజన్‌, గౌతమ్‌ గంభీర్‌, మహ్మద్‌ కైఫ్‌, యువరాజ్‌ సింగ్‌, రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, యుజువేంద్ర చాహల్‌, సురేశ్‌రైనా, రిషభ్‌పంత్‌ సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు పంచుకొని శుభాకాంక్షలు చెప్పారు.

> భారత్‌ అంటే ప్రేమ, గర్వం, ఇష్టం.. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.-రోహిత్‌ శర్మ

> ఈరోజు మనం ఏం చేస్తామో దానిపైనే భవిష్యత్‌ ఆధారపడి ఉంది. దేశం ఉన్నత శిఖరాలకు చేరడానికి మనమంతా కలిసి కట్టుగా ఉందాం. ప్రతి ఒక్కరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్‌. -విరాట్‌ కోహ్లీ

> అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారత దేశం పాటిస్తున్న విలువలు..మనకు మార్గనిర్దేశం చూపే కాంతిగా ఉండాలని ఆకాంక్షిస్తున్నా.  -సచిన్‌ తెందూల్కర్‌

> ఈ 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశాభివృద్ధికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ సెల్యూట్‌. ఈ విపత్కర సమయంలో మనమందరం తోటివారికి అండగా నిలుద్దాం. హ్యాపీ రిపబ్లిక్‌ డే. -సురేశ్‌ రైనా

> అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, వేడుకలు జరుపుకొన్నాక ఎవరూ జాతీయ జెండాలను రోడ్లపై పడేయొద్దని విజ్ఞప్తి.  -వీరేంద్ర సెహ్వాగ్‌

> గొప్ప దేశానికి వేలాది వందనాలు. భారత్‌ ఇంకా అభివృద్ధి చెందాలి. ప్రతి ఒక్కరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. -యుజువేంద్ర చాహల్‌

> మనం ఈ దేశ బిడ్డలం. అందుకు గర్వపడుతున్నాం. మూడు రంగుల జెండా మా దేశ గుర్తింపు. అదే మా హిందూస్థాన్‌. దేశభక్తుల త్యాగాల వల్ల మనకు స్వాతంత్ర్యం లభించింది. ఎవరడిగినా భారతీయులమని గర్వంగా చెబుతాం. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.-హర్భజన్‌సింగ్‌.

> ప్రజల గొంతుకలో పరమాత్ముని స్వరం దాగి ఉంటుంది. ప్రతి ఒక్కరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. జై హింద్‌. -గౌతమ్‌ గంభీర్‌

> సగర్వంగా మువ్వన్నెల జెండాను పట్టుకోవడానికి మించి క్రీడాకారులకు ఏదీ ఎక్కువ కాదు. ఈ గణతంత్ర దినోత్సవం రోజు మన గొప్ప దేశం గురించి సెలబ్రేట్‌ చేసుకోవాల్సింది చాలా ఉంది. రిపబ్లిక్‌ డే శుభాకాంక్షలు.  -మహ్మద్‌ కైఫ్‌

> భారత దేశానికి ప్రాతినిధ్యం వహించడం నా జీవితంలో గొప్ప గౌరవం. నేనెక్కడ ఉన్నా ఎగురుతున్న త్రివర్ణ పతాకాన్ని చూస్తే నా గుండెలో ఊహించని విధంగా గర్వం ఉప్పొంగుతుంది. మనమంతా ఈ దేశాన్ని మరిన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలి. -యువరాజ్‌ సింగ్‌

> టీమ్‌ఇండియాకు ప్రాతినిధ్యం వహించే అనుభూతికి ఏదీ చేరువ కాదు. హ్యాపీ రిపబ్లిక్‌ డే -రిషభ్‌పంత్‌

ఇవీ చదవండి..
రఫేల్‌.. రామమందిరం..గణతంత్ర విశేషాలు!
సారీ ఇండియా.. రాలేకపోయాను!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని