మోదీ ప్రశంసలు..బీసీసీఐ ధన్యవాదాలు

గబ్బా టెస్టులో చారిత్రక విజయం సాధించి టెస్టు సిరీస్‌ను గెలిచిన టీమిండియాను ప్రధాని నరేంద్ర మోదీ మన్‌కీబాత్‌లో కొనియాడారు. ‘ఈ నెలలో క్రికెట్‌ నుంచి మనకో శుభవార్త వచ్చింది. ఆదిలో ఎన్నో ఒడుదొడుకులు ఎదురైనా...

Published : 31 Jan 2021 16:00 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: గబ్బా టెస్టులో చారిత్రక విజయం సాధించి టెస్టు సిరీస్‌ను గెలిచిన టీమిండియాను ప్రధాని నరేంద్రమోదీ మన్‌కీబాత్‌లో కొనియాడారు. ‘ఈ నెలలో క్రికెట్‌ నుంచి మనకో శుభవార్త వచ్చింది. ఆదిలో ఎన్నో ఒడుదొడుకులు ఎదురైనా భారత జట్టు అద్భుతంగా పుంజుకుంది. ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్‌ గెలిచింది. మన జట్టు కృషి, సమష్టి పోరాటం స్ఫూర్తిదాయకం’ అని మోదీ అన్నారు.

మోదీ వ్యాఖ్యలపై బీసీసీఐ, టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ స్పందించారు. ‘‘ప్రేరణిచ్చే ఈ మాటలకు, ప్రశంసలకు ధన్యవాదాలు. త్రివర్ణ పతాకం అత్యున్నత ఎత్తులో ఎగరడానికి సాధ్యమైనంత వరకు పోరాడతాం’’ అని బీసీసీఐ ట్వీట్ చేసింది. మరోవైపు మోదీ మాటలను కోహ్లీ రీట్వీట్ చేస్తూ జాతీయ జెండాను పోస్ట్ చేశాడు.

తొలి టెస్టులో ఘోరఓటమి, జట్టుకు ప్రధాన ఆటగాళ్లు దూరమైన ప్రతికూలతల నడుమ.. భారత్ గొప్పగా పోరాడిన సంగతి తెలిసిందే. నాలుగు టెస్టుల సిరీస్‌ను 2-1తో సాధించింది. మెల్‌బోర్న్‌లో బౌలర్ల సమష్టి పోరాటం, రహానె కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో విజయం సాధించగా, సిడ్నీ టెస్టులో రవిచంద్రన్ అశ్విన్‌, హనుమ విహారి అద్భుత పోరాట పటిమతో మ్యాచ్‌ డ్రా ముగించింది. ఇక నిర్ణయాత్మక గబ్బా టెస్టులో యువఆటగాళ్ల సంచలన ప్రదర్శనతో చారిత్రక విజయాన్ని అందుకుంది.

ఇవీ చదవండి

త్రివర్ణ పతాకానికి జరిగిన అవమానం బాధించింది

అది చరిత్ర.. ఇప్పుడు నేను కెప్టెన్‌ కాదు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని