IPL 2021: ఈ సీజన్లో మెరిసిన ఆటగాళ్లు.. దక్కిన అవార్డులు..!
ఇదివరకు ఎన్నడూ లేని విధంగా ఐపీఎల్ 14వ సీజన్ రెండు అంచెలుగా జరిగింది. తొలుత ఏప్రిల్ 9న చెన్నైలో ఆరంభమైన ఈ ప్రయాణం అక్టోబర్ 15న దుబాయ్‌లో ముగిసింది...
(Photos: Ruturaj, Harshal, KL Rahul Instagram)
ఇంటర్నెట్‌డెస్క్: ఇదివరకు ఎన్నడూ లేని విధంగా ఐపీఎల్ 14వ సీజన్ రెండు అంచెలుగా జరిగింది. తొలుత ఏప్రిల్ 9న చెన్నైలో ఆరంభమైన ఈ ప్రయాణం అక్టోబర్ 15న దుబాయ్‌లో ముగిసింది. దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓటమి చవిచూసిన చెన్నై సూపర్ కింగ్స్.. చివరికి ఫైనల్లో కోల్‌కతాపై విజయం సాధించి నాలుగోసారి టైటిల్ ఎగరేసుకుపోయింది. ఈ క్రమంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, దిల్లీ క్యాపిటల్స్ జట్లు కూడా మెరుగైన ప్రదర్శన చేసి ప్లేఆఫ్స్ వరకూ చేరాయి. అయితే, ఆ రెండు జట్లు కీలక మ్యాచ్‌ల్లో ఓటమిపాలై కప్పుకు దూరమయ్యాయి. అయితే, ఈ సీజన్లో ఆయా జట్లలోని పలువురు ఆటగాళ్లు రాణించిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. దీంతో టోర్నీ నిర్వాహకులు వారందరినీ ప్రత్యేక అవార్డులతో సత్కరించారు. ఎవరెవరు ఏయే విభాగాల్లో రాణించారో చూద్దాం..!
* ఈ సీజన్లో అత్యంత విలువైన ఆటగాడు హర్షల్ పటేల్ (ఆర్సీబీ)
* ఆరెంజ్ క్యాప్: రుతురాజ్ (సీఎస్కే) 635 పరుగులు, 1 శతకం, 4 అర్ధశతకాలు
* పర్పుల్ క్యాప్: హర్షల్ పటేల్. ఒక సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో బ్రావో (2012)తో సమానంగా నిలిచాడు. 5 వికెట్ల ప్రదర్శన ఒకసారి, నాలుగు వికెట్ల ప్రదర్శన మరోసారి.
* పవర్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్: వెంకటేశ్ అయ్యర్ (కేకేఆర్), (10 మ్యాచ్‌ల్లో 370 పరుగులు)
* అత్యధిక సిక్సర్లు: కేఎల్ రాహుల్ (పీబీకేఎస్) ఈ సీజన్లో ఏకంగా 30 సిక్సులు బాదాడు.
* గేమ్ చేంజర్ ఆఫ్ ది సీజన్ : హర్షల్ పటేల్
* సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ : షిమ్రన్ హెట్మైయర్ (168 స్ట్రైక్‌రేట్)
* క్యాచ్ ఆఫ్ ది సీజన్ : రవిబిష్ణోయ్. అహ్మదాబాద్‌లో కోల్‌కతా బ్యాట్స్‌మన్ సునీల్ నరైన్ ఆడిన షాట్‌ను డీప్‌మిడ్ వికెట్లో ఫుల్లెంత్ డైవ్ చేస్తూ క్యాచ్ అందుకున్నాడు.
* ఫెయిర్‌ప్లే అవార్డు : రాజస్థాన్ రాయల్స్ జట్టుకు.
* ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ : రుతురాజ్ గైక్వాడ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్‌లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టులో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్‌లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్‌కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్‌పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్‌కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్‌ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్‌కు నో ఛాన్స్.. ఈ లఖ్‌నవూ స్టార్‌కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!