USA U-19W Team: మహిళల U19 ప్రపంచకప్ కోసం యూఎస్‌ఏ టీమ్.. అందరూ భారత సంతతే!
భారత్‌లో క్రికెట్‌కు ఆదరణ భారీగా ఉంటుంది. అలాగే ఆటను ఆడేవారూ ఎక్కువే. అదే అమెరికాలో అయితే బేస్‌బాల్, వాలీబాల్, ఫుట్‌బాల్... ఇలా క్రికెటేతర ఆటలు ప్రసిద్ధి. అయితే ఇటీవల అమెరికాలోనూ క్రికెట్‌కు ఆదరణ పెంచేందుకు ఐసీసీ చర్యలు చేపట్టింది. దీంతో వచ్చే ఏడాది జరిగే అండర్ - 19 ప్రపంచకప్ కోసం జట్టును ప్రకటించింది. ఈ జట్టులో అందరూ భారత్ మూలాలు ఉన్నవారే కావడం విశేషం.
(ఫొటో సోర్స్: యూఎస్‌ఏ క్రికెట్ ట్విటర్)
ఇంటర్నెట్ డెస్క్: వచ్చే ఏడాది జనవరి తొలి వారంలో తొలిసారిగా జరిగే మహిళల అండర్ -19 ప్రపంచకప్ పోటీలకు యూఎస్‌ఏ తన జట్టును ప్రకటించింది. ప్రతి దేశం తమ టీమ్‌లను ప్రకటిస్తుంది కదా.. ఇందులో వింతేముందంటారా? అయితే, ఇక్కడ రెండు ఆసక్తికరమైన విషయాలున్నాయి. మరి అవేంటో తెలుసుకోవాలని ఉందా..?
అమెరికా నుంచి తొలి మహిళా జట్టు
అమెరికా 2010లో పురుషుల అండర్ -19 జట్టు ప్రపంచకప్‌లో ఆడగా.. తాజాగా ఆ దేశ మహిళా జట్టు కూడా తొలిసారి ప్రపంచకప్ కోసం రంగంలోకి దిగింది. దక్షిణాఫ్రికా వేదికగా జనవరి 7వ తేదీ నుంచి జనవరి 29వ తేదీ వరకు టోర్నీ జరగనుంది. 16 జట్లు పాల్గొనే ఈ మెగా టోర్నీలో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, శ్రీలంకతో కూడిన గ్రూప్ - Aలో యూఎస్‌ఏ తలపడనుంది.
అందరూ భారత మూలాలు ఉన్నవారే..
అండర్ - 19 ప్రపంచకప్ కోసం యూఎస్‌ఏ 15 మందితో కూడిన ప్రధాన జట్టును ఎంపిక చేసింది. కెప్టెన్‌గా గీతికా కొడాలి బాధ్యతలు నిర్వర్తించనుంది. అలాగే మిగతా వారంతా భారత మూలాలు కలిగిన క్రికెటర్లు కావడం గమనార్హం. వెస్టిండీస్ మాజీ స్టార్ బ్యాటర్ శివనారయణ్ చంద్రపాల్ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తాడు. అలాగే మరో ఐదుగురిని రిజర్వ్‌లో ఉంచారు. ఇందులో కెప్టెన్, వైస్ కెప్టెన్ సహా తెలుగు రాష్ట్రాల నేపథ్యం ఉన్నవారే ఐదుగురు ఉండటం విశేషం.
యూఎస్‌ఏ జట్టు ఇదే:
గీతికా కొడాలి (కెప్టెన్), అనికా కొలన్ (వైస్ కెప్టెన్), అదితి చుదసామ, భూమిక భద్రిరాజు, దిశా దింగ్రా, ఇసాని వంగేలా, జివానా అరాస్, లాస్య ముళ్లపూడి, పూజా గణేశ్, పూజా షా, రితు సింగ్, సాయి తన్మయి ఈయున్ని, స్నిగ్ధ పాల్, సుహాని తదాని, తరనుమ్ చోప్రా
రిజర్వ్: చేత్నా ప్రసాద్, కస్తూరి వేదాంతమ్, లిసా రంజిత్, మిథాలీ పట్వార్థాన్, టై గోన్సాల్వేస్
యూఎస్‌ఏ మ్యాచ్‌లు ఇలా:
* శ్రీలంకతో జనవరి 14న
* ఆస్ట్రేలియాతో జనవరి 16న
* బంగ్లాదేశ్‌తో జనవరి 18న
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Harish Rao: వైద్యరంగంలో మనం దేశానికే ఆదర్శం: హరీశ్‌రావు
-
General News
Srisailam: శ్రీశైలం ఘాట్రోడ్లో రక్షణ గోడను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. తప్పిన పెను ప్రమాదం
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Movies News
Chiranjeevi: జన్మజన్మలకు నీకే బిడ్డలుగా పుట్టాలని కోరుకుంటున్నాం..: చిరంజీవి
-
India News
PM Modi: బడ్జెట్ సమావేశాల వేళ.. మంత్రులతో ప్రధాని మోదీ కీలక భేటీ
-
General News
TelangaNews: ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలపై టీఎస్ఎల్పీఆర్బీ కీలక నిర్ణయం