Virat Kohli: అప్పుడే వారి అభిప్రాయాల నుంచి బయట పడగలుగుతాం: విరాట్ కోహ్లీ మెసేజ్
డబ్ల్యూటీసీ పైనల్స్‌లో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ టాప్ ఆర్డర్ పేకమేడలా కూలిపోయింది. విరాట్ కోహ్లీ తక్కువ పరుగులకే పెవిలియన్ చేరుకోవడం విమర్శలకు తావిచ్చింది. ఈ విమర్శలకు కింగ్ కోహ్లీ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు.
ఇంటర్నెట్‌డెస్క్: టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli)విమర్శకులకు తన ఇన్‌స్టా స్టోరీ రూపంలో జవాబు ఇచ్చాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ (WTC Final) మూడో రోజు మ్యాచ్ ప్రారంభానికి కొన్ని గంటల ముందు ఈ స్టోరీని పోస్టు చేయడం విశేషం. ఓవల్ టెస్ట్‌లో రెండో రోజు 14 పరుగుల స్వల్ప స్కోరుకే విరాట్ వికెట్ సమర్పించుకొన్నాడు. ఆ తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో సహచరులతో కలిసి ఆహారం తింటున్న చిత్రాలు సోషల్ మీడియాలో వెలువడ్డాయి. దీంతో ట్రోలర్స్ విరాట్‌ను లక్ష్యంగా చేసుకొన్నారు.
ఈ విమర్శలపై కింగ్ కోహ్లీ తనదైన శైలిలో స్పందించాడు. ‘ఇతరుల అయిష్టాన్ని అంగీకరించ గల సామర్థ్యాన్ని మనం పెంపొందించుకోవాలి. అప్పుడే జైలును తలపించే వారి అభిప్రాయాల నుంచి బయట పడగలుగుతాం’ అనే అర్థం వచ్చేలా సందేశాన్ని ఉంచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 30 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన స్థితిలో పుజారా, కోహ్లి ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఏడు ఓవర్ల పాటు వికెట్ పడలేదు. స్కోరు 50కి చేరుకుంది. పరిస్థితి మెరుగుపడుతోంది అనుకునేలోపే గ్రీన్ బౌలింగ్‌లో పుజారా పేలవ రీతిలో బౌల్డయి వెనుదిరిగాడు. తర్వాత భారత బ్యాటింగ్‌లో అత్యంత కీలకమైన కోహ్లి(14)ని స్టార్క్ ఒక కళ్లు చెదిరే బంతితో ఔట్ చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.