Hardik Pandya: ఈ సీజన్‌లో మా ఆటతీరును.. ఎవరూ మరచిపోలేరు..! హార్దిక్‌ పాండ్య

ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ఎవరూ మరచిపోలేని అత్యుత్తమ ప్రదర్శన ఇస్తామని ముంబయి జట్టు సారథి హార్దిక్‌ పాండ్య పేర్కొన్నాడు.

Published : 16 Mar 2024 00:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మరికొన్ని రోజుల్లో ఐపీఎల్‌ 2024 (IPL 2024) సీజన్‌ ప్రారంభం కానుంది. గుజరాత్‌ (Gujarat Titans) జట్టు నుంచి ముంబయి (Mumbai Indians)కి తిరిగివచ్చిన హార్దిక్‌ పాండ్య (Hardik Pandya) సారథ్య బాధ్యతలు చేపట్టాడు. ఈ క్రమంలోనే ముంబయికి తిరిగిరావడంపై అతడు కీలక వ్యాఖ్యలు చేశాడు. అదే విధంగా.. ఈ సీజన్‌లో ఎవరూ మరచిపోలేని ప్రదర్శన ఇస్తామని పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన వీడియోను ముంబయి ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేసింది.

‘‘ఈ రంగు జెర్సీ ధరించిన అనుభూతి చాలా ప్రత్యేకం. నా ప్రయాణం ఇక్కడే మొదలైంది. సొంత గూటికి తిరిగి వచ్చి ఆడటం ఎల్లప్పుడూ స్పెషల్‌గా ఉంటుంది. మలింగ మొదటి నుంచి సోదరుడిలా వెన్నంటి ఉన్నాడు. మార్క్‌ బౌచర్‌ ఓ అద్భుతం. అందరూ గర్వపడే స్థాయి క్రికెట్ ఆడేందుకు ప్రయత్నిస్తాం. ఎవరూ మరచిపోలేని ఆటతీరు ప్రదర్శిస్తాం’’ అని పాండ్య పేర్కొన్నాడు.

వావ్‌.. నేను అన్ని అర్ధ శతకాలు నమోదు చేశానా? : హార్దిక్‌ పాండ్య

మరో వీడియోలో హార్దిక్‌పై ముంబయి ప్రధాన కోచ్ మార్క్ బౌచర్ ప్రశంసలు కురిపించాడు. ‘‘డ్రెస్సింగ్‌ రూం గురించి నాకంటే ఎక్కువ పాండ్యాకే తెలుసు. ఈ సీజన్ కోసం ఉత్సాహంగా ఉన్నాడు. అతడి సారథ్యంలో విజయాలకు ఎదురుచూస్తున్నాం. టీమ్‌లో కొంతమంది కొత్తవాళ్లు ఉన్నారు. కాబట్టి, కొంత కలవరపాటు కూడా ఉంది. సీజన్‌ ప్రారంభమయ్యేనాటికి అంతా సర్దుకునేలా ప్రయత్నిస్తాం’’ అని వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని