టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్

ఇంటర్నెట్‌ డెస్క్‌ : దుబాయ్‌ వేదికగా లీగ్‌లో 54వ మ్యాచ్‌లో కోల్‌కతా, రాజస్థాన్‌ జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్‌ గెలిచిన రాజస్థాన్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉన్న రాజస్థాన్‌, ఏడో స్థానంలో ఉన్న కోల్‌కతాలకు ఈ మ్యాచ్‌ గెలిస్తే ఫ్లేఆఫ్స్‌కు వెళ్లే మార్గాలు మెరుగవుతాయి. రెండు జట్లు 12 పాయింట్లతో ఉన్నా నెట్‌రన్‌రేట్‌పరంగా పాయింట్ల పట్టికలో కోల్‌కతా ఏడోస్థానంలో

Updated : 01 Nov 2020 19:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దుబాయ్‌ వేదికగా జరుగుతున్న టీ20 మెగా టోర్నీలో కోల్‌కతా, రాజస్థాన్‌ జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్‌ గెలిచిన రాజస్థాన్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. పాయింట్ల పట్టికలో రాజస్థాన్‌ ఆరో స్థానంలో ఉండగా, కోల్‌కతా ఏడో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌ గెలిస్తే ఇరు జట్లకు ఫ్లేఆఫ్స్‌కు వెళ్లే మార్గాలు మెరుగవుతాయి. రెండు జట్లు 12 పాయింట్లతో ఉన్నా నెట్‌ రన్‌రేట్‌పరంగా పాయింట్ల పట్టికలో కోల్‌కతా ఏడోస్థానంలో నిలిచింది. ఈ జట్టు నాలుగో స్థానానికి చేరాలంటే రాజస్థాన్‌తో గెలవడంతో పాటు భారీ విజయాన్ని అందుకోవాలి. మరో వైపు ముంబయి, పంజాబ్‌తో ఆడిన చివరి రెండు మ్యాచుల్లో గెలిచి ఊపు మీదుంది. ఈ జట్టు సైతం భారీ తేడాతో గెలిస్తేనే ఫ్లేఆఫ్‌కు చేరే అవకాశం ఉంటుంది.

కోల్‌కతా: శుభమన్‌ గిల్‌, నితీశ్‌ రాణా, నరైన్‌, ఇయాన్‌ మోర్గాన్‌(కెప్టెన్‌), దినేశ్‌ కార్తీక్‌, రసెల్‌, త్రిపాఠి, కమిన్స్‌, కమలేశ్‌ నాగర్‌ కోటి, శివమ్‌ మావి, వరుణ్‌ చక్రవర్తి

రాజస్థాన్‌: ఉతప్ప, బెన్‌ స్టోక్స్‌, సంజు శాంసన్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్‌)‌, బట్లర్‌, రియాన్‌ పరాగ్‌, రాహుల్ తెవాతియా, ఆర్చర్‌, శ్రేయస్‌ గోపాల్‌, వరుణ్‌ ఆరోన్‌, కార్తీక్‌ త్యాగి 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని