తప్పులు, వైఫల్యాల్ని కోహ్లీ అంగీకరిస్తాడు..

టీమిండియా సారథి విరాట్ కోహ్లీ కెప్టెన్సీని జమైకా స్ప్రింటర్‌ యోహన్‌ బ్లేక్‌ కొనియాడాడు. తొలి టెస్టు ఓటమి అనంతరం తమ తప్పులు, వైఫల్యాలు అంగీకరిస్తున్నామని కోహ్లీ చెప్పడాన్ని...

Updated : 10 Feb 2021 13:25 IST

అందుకే అతడి కెప్టెన్సీని ప్రేమిస్తాను : జమైకా స్ప్రింటర్‌ బ్లేక్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమిండియా సారథి విరాట్ కోహ్లీ కెప్టెన్సీని జమైకా స్ప్రింటర్‌ యోహన్‌ బ్లేక్‌ కొనియాడాడు. తొలి టెస్టు ఓటమి అనంతరం తమ తప్పులు, వైఫల్యాలు అంగీకరిస్తున్నామని కోహ్లీ చెప్పడాన్ని మెచ్చుకున్నాడు. టెస్టు క్రికెట్‌ ఎంతో అద్భుతంగా ఉంటుందని, భారత్×ఇంగ్లాండ్‌ రెండో టెస్టు కోసం ఎదురుచూస్తున్నాని ట్విటర్‌లో పోస్ట్ చేసిన వీడియోలో పేర్కొన్నాడు. 2011 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో బ్లేక్‌ 100 మీటర్ల పరుగులో స్వర్ణం సాధించిన విషయం తెలిసిందే. 100 మీ, 200 మీ పరుగులో ఉసేన్ బోల్ట్‌ తర్వాత అతివేగవంతమైన పరుగుల వీరుడిగా అతడు రికార్డులు సృష్టించాడు.

‘‘భారత్×ఇంగ్లాండ్‌ తొలి టెస్టు గొప్పగా సాగింది. జో రూట్ అద్భుతంగా ఆడాడు. ఇంగ్లాండ్ చక్కని ప్రదర్శన చేసింది. అండర్సన్‌ అదరగొట్టాడు. వయసు కేవలం అతడికి ఒక సంఖ్యే అని చాటిచెప్పాడు. ఇక టీమిండియా అంటే నాకు ఎంతో ఇష్టం. కోహ్లీ కెప్టెన్సీని ప్రేమిస్తున్నాను. అతడు తప్పులు, వైఫల్యాల్ని అంగీకరిస్తాడు. బౌలర్లు బంతుల్ని సరైన ప్రదేశాల్లో వేయలేదని, బ్యాట్స్‌మెన్‌ నిలకడగా పరుగులు సాధించలేదని ఒప్పుకున్నాడు. జట్టు ప్రణాళికలు గురించి తిరిగి ఆలోచిస్తామని చెప్పాడు. అందుకే కోహ్లీ నాయకత్వం అంటే నాకు ఎంతో ఇష్టం’’ అని బ్లేక్ తెలిపాడు.

‘‘శుభ్‌మన్‌ గిల్‌ బ్యాటింగ్‌ ఎంతో బాగుంది. అతడు గొప్ప బ్యాట్స్‌మన్‌. ఇక రిషభ్‌ పంత్‌ అద్భుతం. ప్రతీసారి గొప్ప ఇన్నింగ్స్‌లు సాధించడం సాధ్యం కాదు. కానీ పంత్ టెస్టు క్రికెట్‌ బాగా ఆడతాడు. పుజారా ఎంతో నాణ్యమైన బ్యాట్స్‌మన్‌. ఆస్ట్రేలియాలో అతడి పోరాటాన్ని చూశాను. టెస్టు క్రికెట్ మానసికంగానూ ఎంతో సవాల్‌. అందుకే సుదీర్ఘ ఫార్మాట్ నాకు ఎంతో ఇష్టం. ఆస్ట్రేలియా సిరీస్‌లో భారత్ తొలుత 0-1తో వెనుకంజలో ఉంది. ఇప్పుడు ఇంగ్లాండ్ సిరీస్‌లోనూ అదే పరిస్థితి. అయితే స్వదేశంలో టీమిండియా ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి. రెండో టెస్టు కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నా’’ అని బ్లేక్‌ పేర్కొన్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్ 227 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. శనివారం నుంచి రెండో టెస్టు ప్రారంభం కానుంది.

వీ చదవండి

వచ్చే మ్యాచ్‌లో కోహ్లీ 250 పరుగులు సాధిస్తాడు: నెహ్రా

రెండో టెస్టులో అతడికే చోటు: గావస్కర్‌


Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు