ఖమ్మంలో మిరపకు రూ.18,500 గరిష్ఠ ధర

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం ఏసీ తేజ రకం ఎండు మిరపకు రికార్డు ధర పలికింది. వ్యాపారులు క్వింటాకు గరిష్ఠంగా రూ.18,500 చొప్పున పోటీపడి కొనుగోలు చేశారు. కనిష్ఠ ధర రూ.9,800, నమూనా

Updated : 07 Dec 2021 16:09 IST

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌, న్యూస్‌టుడే: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం ఏసీ తేజ రకం ఎండు మిరపకు రికార్డు ధర పలికింది. వ్యాపారులు క్వింటాకు గరిష్ఠంగా రూ.18,500 చొప్పున పోటీపడి కొనుగోలు చేశారు. కనిష్ఠ ధర రూ.9,800, నమూనా ధర రూ.13,600 పలికింది. సోమవారం విపణికి మొత్తం 800 బస్తాలు రాగా గంట వ్యవధిలోనే కొనుగోళ్లు పూర్తయ్యాయి. మిరపకు ఈ సీజన్‌లో ఇంత ధర పలకడం ఇదే తొలిసారి. ఈ నెల 3న క్వింటాకు గరిష్ఠ ధర రూ.14,650 ఉండగా.. 3 రోజుల వ్యవధిలోనే రూ.3,850 అదనంగా పెరగడం గమనార్హం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని