కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రానికి పేరు సూచించండి

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో నిర్మిస్తున్న పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రానికి మంచి పేరు సూచించాలని నగర కొత్వాల్‌ సీవీ ఆనంద్‌ ప్రజలు, నెటిజన్లను శుక్రవారం ట్విటర్‌ ద్వారా కోరారు. పోలీస్‌ టవర్స్‌, ట్విన్‌ టవర్స్‌ అని కొందరు అంటున్నారని, వాస్తవానికి సముదాయంలో నాలుగు టవర్లున్నాయని పేర్కొన్నారు.

Published : 15 Jan 2022 06:08 IST

హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో నిర్మిస్తున్న పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రానికి మంచి పేరు సూచించాలని నగర కొత్వాల్‌ సీవీ ఆనంద్‌ ప్రజలు, నెటిజన్లను శుక్రవారం ట్విటర్‌ ద్వారా కోరారు. పోలీస్‌ టవర్స్‌, ట్విన్‌ టవర్స్‌ అని కొందరు అంటున్నారని, వాస్తవానికి సముదాయంలో నాలుగు టవర్లున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రానికే తలమానికంగా ఉండే ఈ భవనానికి వినూత్నమైన పేరు సూచించాలన్నారు. వీటిని పోలీసుశాఖకు సంబంధించిన సామాజిక మాధ్యమ ఖాతాల ద్వారా పంపాలన్నారు. వచ్చిన వాటిలో అత్యుత్తమైన పేరును ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎంపిక చేస్తారని, ఆ పేరు సూచించిన వారిని కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం ప్రారంభోత్సవం రోజున సత్కరిస్తామన్నారు. కొత్వాల్‌ ట్వీట్‌కు స్పందించిన కొందరు ‘క్వాడ్‌ కాప్‌’, ‘పోలీస్‌ టవర్స్‌ 4.0’, ‘టీ టవర్స్‌’, ‘విజిల్స్‌ అర్బన్‌’ ‘తెలంగాణ పోలీస్‌ మినార్‌’, ‘రక్షక్‌ స్క్వేర్‌’ ‘ఫాల్కన్‌ టవర్స్‌’, ‘డెక్కన్‌ ఎస్‌ స్క్వాడ్‌’ ‘సురక్షా భవన్‌’ వంటి పేర్లు సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని