
365 రకాల వంటకాలతో ఆతిథ్యం
కాబోయే వధూవరులకు తాతయ్య సంక్రాంతి విందు
నరసాపురం, న్యూస్‌టుడే: పండగ సమయాల్లో అత్తింట అల్లుళ్లను అపురూపంగా చూసుకుంటారు. ఈ సంప్రదాయం గోదావరి జిల్లాల్లో మరీ ఎక్కువ. సంక్రాంతి సమయంలో ఈ హంగామా అంతా ఇంతా కాదు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన అత్యం మాధవి-వెంకటేశ్వరరావు దంపతుల కుమార్తె కుందవి వివాహం తణుకుకు చెందిన సాయికృష్ణతో నిశ్చయమైంది. నరసాపురం పట్టణానికి చెందిన కుందవి తాతయ్య, అమ్మమ్మ గోవిందు-నాగమణి దంపతులు కాబోయే వధూవరులను సంక్రాంతికి తమ ఇంటికి ఆహ్వానించారు. మనవడికి శనివారం 365 రకాల వంటలను రుచి చూపించారు. 100 రకాల మిఠాయిలు, పులిహోర, దద్దోజనం, 30 రకాల కూరలతో పాటు రకరకాల పిండి వంటలను వడ్డించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.