365 రకాల వంటకాలతో ఆతిథ్యం

పండగ సమయాల్లో అత్తింట అల్లుళ్లను అపురూపంగా చూసుకుంటారు. ఈ సంప్రదాయం గోదావరి జిల్లాల్లో మరీ ఎక్కువ. సంక్రాంతి సమయంలో ఈ హంగామా అంతా ఇంతా కాదు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి

Published : 17 Jan 2022 04:16 IST

కాబోయే వధూవరులకు తాతయ్య సంక్రాంతి విందు

నరసాపురం, న్యూస్‌టుడే: పండగ సమయాల్లో అత్తింట అల్లుళ్లను అపురూపంగా చూసుకుంటారు. ఈ సంప్రదాయం గోదావరి జిల్లాల్లో మరీ ఎక్కువ. సంక్రాంతి సమయంలో ఈ హంగామా అంతా ఇంతా కాదు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన అత్యం మాధవి-వెంకటేశ్వరరావు దంపతుల కుమార్తె కుందవి వివాహం తణుకుకు చెందిన సాయికృష్ణతో నిశ్చయమైంది. నరసాపురం పట్టణానికి చెందిన కుందవి తాతయ్య, అమ్మమ్మ గోవిందు-నాగమణి దంపతులు కాబోయే వధూవరులను సంక్రాంతికి తమ ఇంటికి ఆహ్వానించారు. మనవడికి శనివారం 365 రకాల వంటలను రుచి చూపించారు. 100 రకాల మిఠాయిలు, పులిహోర, దద్దోజనం, 30 రకాల కూరలతో పాటు రకరకాల పిండి వంటలను వడ్డించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు