
Published : 20 Jan 2022 05:49 IST
చిట్టి చిలకమ్మా.. పంట తినకమ్మా!
ఆరుగాలం కష్టించి సాగు చేసిన పంటలకు తెగుళ్లు సోకడానికి తోడు కోతులు, పందులు, పక్షుల కారణంగా రైతులు నష్టాలను చవిచూస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కంది మండలం కాశీపూర్ గ్రామ శివారులో రైతులు పొద్దుతిరుగుడు పంట సాగు చేశారు. చిలకలు గుంపులుగుంపులుగా వచ్చి ఆ పంట గింజలను తినేస్తుండడంతో నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
-ఈనాడు సంగారెడ్డి
Tags :