Published : 22 Jan 2022 05:01 IST

తితిదే ప్రత్యేక ఆహ్వానితుల నియామకంపై చట్ట సవరణ

హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం

ఈనాడు, అమరావతి: తితిదే ప్రత్యేక ఆహ్వానితుల నియామకం విషయంలో చట్ట సవరణ చేయనున్నామని ఏపీ ప్రభుత్వం శుక్రవారం హైకోర్టుకు తెలిపింది. నిర్ణయం తీసుకున్నామని, పూర్తి వివరాలతో కౌంటర్‌ వేసేందుకు సమయం కావాలని కోరింది. ఈ వాదనపై పిటిషనర్ల తరఫు న్యాయవాదులు పీవీజీ ఉమేశ్‌చంద్ర, బాలాజీ వడేరా అభ్యంతరం తెలిపారు. దేవాదాయ చట్టంలో ‘ప్రత్యేక ఆహ్వానితుల’ ప్రస్తావనే లేదని తెలిపారు. ఇప్పటికే తితిదే బోర్డు సభ్యులుగా 29 మంది ఉన్నారని, సవరణ చేయడం చట్ట విరుద్ధమేనని అన్నారు.  తనను ప్రతివాదిగా చేర్చుకొని వాదనలు వినిపించేందుకు అవకాశమివ్వాలంటూ తిరుపతి ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి వేసిన అనుబంధ పిటిషన్‌ను కోర్టు అంగీకరిస్తూ విచారణను ఫిబ్రవరి 15కి వాయిదా వేసింది.

Read latest State News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని